World Biggest Temple: ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆలయం ఎక్కడా చూసి ఉండరు
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దేవాలయం నిర్మాణం జరుగుతోంది. అద్భుతమైన ఈ నిర్మాణం ఇండియాలోని పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో వేదిక్ ప్లానిటోరియం టెంపుల్‌ను ఇస్కాన్ సంస్థ నిర్మిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దేవాలయం నిర్మాణం జరుగుతోంది. అద్భుతమైన ఈ నిర్మాణం ఇండియాలోని పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో వేదిక్ ప్లానిటోరియం టెంపుల్‌ను ఇస్కాన్ సంస్థ నిర్మిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయంగా అవతరించబోతున్న ఈ టెంపుల్ ఫొటోలను ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ సంస్థ నిర్వాహకులు ఇటీవలే ట్విట్టర్‌లో షేర్ చేశారు. 2010లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు విలువ వంద మిలియన్ డాలర్లట. విశ్వంలోని వివిధ గ్రహాల కదలికలకు ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారట. వేదాల ప్రకారం విశ్వం గురించి, ఇతర పురాణ కథల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశంలోని ఐకానిక్ భవనాల జాబితాలో చేరనున్న ఈ ఆలయం.. వాటికన్‌లోని సెయింట్‌పాల్ కేథడ్రల్ కంటే, ఆగ్రాలోని తాజ్‌మహల్ కంటే పెద్దది. ఆలయ డోమ్ సైతం ప్రపంచంలోనే అతి పెద్దదట. ఇకనుంచి ఇస్కాన్ సంస్థ ప్రధాన కేంద్రంగా ఇది పనిచేయనుందట. అంతేకాదు ఒకేసారి 10వేల మంది భక్తులకు వసతి కల్పించే సామర్థ్యం కలిగి ఉందట. దీని నిర్మాణ వ్యవహారాలన్ని వ్యాపార దిగ్గజం హెన్రీఫోర్డ్ మనవడైన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ పర్యవేక్షిస్తున్నారట. ప్రస్తుతం అంబరీష్ దాస్‌గా పేరు మార్చుకున్న ఆయన ఇస్కాన్ భక్తుడు. ఈ అద్భుత ఆలయాన్ని దర్శించాలంటే 2024 వరకూ ఆగాల్సిందే. 2022నాటికే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యమయిందని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతిపెద్ద గ్రహాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్..
చికెన్ వింగ్స్ తిని బోన్స్ డెలివరీ చేసిన బాయ్ !! అందులో ఓ లెటర్ కూడా..