అర్థరాత్రి మిస్టరీ కాల్.. చిన్నారి గొంతు విని డీజీపీ షాక్
హరియాణా డీజీపీ ఒ.పి.సింగ్‌కు అర్ధరాత్రి ఓ ఫోను వచ్చింది. ఈ సమయంలో ఎవరు చేసారా అని చూస్తే అవతల ఓ చిన్నారి. అర్ధరాత్రి అయినా విసుక్కోకుండా ఆ చిన్నారి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చిన్నారితో మాట్లాడుతున్న క్రమంలో .. అది అనుకోకుండా చేసిన కాల్ అని ఆయనకు అర్థమైంది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులతో డీజీపీ మాట్లాడి.. అది పొరబాటున వచ్చిన కాల్ అని నిర్ధారించుకున్నారు.
ఈ విషయాన్ని తాజాగా ఆయన ఎక్స్ ద్వారా పంచుకున్నారు. పిల్లలను మీరు పెంచొద్దు. వారిని స్వేచ్ఛగా ఎదగనివ్వండి. క్రమశిక్షణ పేరుతో వారిని అతిగా నియంత్రించకండి. వారిని హాయిగా మట్టిలో ఆడుకోనివ్వండి. పార్కులకు తీసుకుపోండి. ఏదైనా ఒక సంగీత వాయిద్యం నేర్పించండి. ’ అని తల్లిదండ్రులకు సూచించారు. ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు కనీసం గంట ముందైనా పిల్లలు ఫోన్‌ను పక్కనపడేసేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎదిగే మెదళ్లకు ఫోను వ్యసనం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ కొంతమంది నిపుణులు చెప్పిన అభిప్రాయాలను సైతం జత చేసారు. ఈ విషయంలో.. విద్యాసంస్థలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మధ్య చిన్నారుల్లో డిజిటల్ స్క్రీన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇటు ఫిజికల్‌గా, అటు మెంటల్‌గా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఫోనే లోకంగా సమయాన్ని గడుపుతున్నారు. అటు.. తమ పనులకు అడ్డురాకుండా ఉంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు. అన్నం తినిపించడానికి, ఆడించటానికి కూడా ఫోనే మాధ్యమం కావటంతో ఇక.. పిల్లలకు అది తప్ప మరో లోకం లేకుండా పోతోంది. ఇదే.. వారిలో అనేక రకాల శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోంది. కనుక పిల్లలు ఫోన్ వాడే సమయాన్ని కట్టడి చేయకపోతే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాక్స్‌లు విసిరికొట్టిన ఉద్యోగులు.. సోన్ పాపడీ మాకొద్దంటూ..
36,000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న ఆ వస్తువేంటి ??
నేను కనుసైగ చేస్తే చాలు..రెండు నిమిషాల్లో అంతా ఖతం
విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ భారీ ఊరట.. లక్ష డాలర్ల ఫీజుపై మినహాయింపు
