క్షుద్ర పూజలపై ఒక్కటైన గ్రామస్తులు.. ఏం చేశారంటే
ప్రశాంతంగా ఉన్న ఊళ్లోకి ఒక జంట వచ్చారు. గ్రహణం రోజు భయంకరమైన పూజలు చేశారు. నెత్తిన నిప్పుల కుంపటి పెట్టుకుని వాళ్లు చేసిన పూజలు చూసి జనం భయపడిపోయారు.. వాళ్లను ఊళ్లోంచి వెళ్లగొట్టి ఇప్పుడు శాంతి పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో జరిగిన నాటి ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
గ్రహణ సమయంలో మంత్ర పఠనం చేస్తే త్వరగా సిద్ధిస్తుందని, ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే సెప్టెంరు 7న జరిగిన చంద్రగ్రహణం రోజు గుంటూరులోని రెడ్డిపాలెం శివాలయం వద్ద అఘోరా ప్రత్యేక పూజలు చేశాడు. నెత్తిమీద నిప్పుల కుంపటి పెట్టుకుని గ్రహణం మొదలైన సమయం నుంచి గ్రహణం వీడే వరకు భయంకరమైన పూజలు చేశారు. అది గమనించిన స్థానికులు దేశంలోని ఆలయాలన్నీ మూసి ఉంటే మన గుడిదగ్గర పూజలు జరగడమేంటని అనుమానించి.. అఘోరాని నిలదీయగా.. అది మృత్యుంజయ హోమమని బుకాయించాడు. తర్వాత గ్రామస్తుల ఒత్తిడి మేరకు అఘోరా.. రెడ్డిపాలెం గ్రామాన్ని వీడి వెళ్లిపోయాడు. అఘోరా గుడిదగ్గర క్షుద్రపూజలు చేసి ఉంటాడని భావించిన గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామానికి ఎలాంటి అరిష్టం చుట్టుకోకుండా పండితుల సలహా మేరకు శివునికి అభిషేకాలు చేయించాలని నిర్ణయించారు. అలాగే, ప్రత్యేక మంత్ర పఠన కార్యక్రమం కూడా చేయిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి, పండితుల సమక్షంలో శివుడికి అభిషేకం చేస్తూ శాంతి హోమం నిర్వహించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పవన్‌ను ఫ్యాన్సే శత్రువుల చేతిలో పెడుతున్నారా?
ఉన్నది వారమే అయినా.. గట్టిగానే సంపాదించిన శ్రష్టి
బంపర్ ఆఫర్ ! ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ! ఏం ప్లాన్ గురూ..!