ఈ సీన్ చూస్తే..వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. వీడియో!
సాధారణంగా ఒక్కపామును చూస్తేనే గుండె వేగం పెరిగిపోతుంది. భయంతో వణికిపోతారు. అలాంటది వేలాది పాములు అదికూడా అతి పెద్ద పాములు ఒకేచోట కనిపిస్తే.. గుండె ఆగిపోయినంతపనవుతుంది. వేలాది పాములు ఒకేచోటకు చేరనున్నాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు ఆ ప్రాంతానికి. ఇంతకీ అవి ఏం పాములు.. ఎక్కడ? ఏంటి అవనే విషయాలు తెలుసుకుందాం. కెనడాలోని మనిటోబ అనే ప్రాంతానికి కొద్ది రోజుల్లో వేలాది పాములు ఒక్కచోటికి చేరనున్నాయి. ఈ ప్రాంతంలో రెడ్ సైడెడ్ గార్టర్ అనే జాతికి చెందిన పాములు పెద్దసంఖ్యలో నివసిస్తాయి. ఇక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. మైనస్ 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో.. ఆ పాములు ఆ ప్రాంతంలో ఉండే సున్నపు రాయితో ఏర్పడ్డ నార్సిస్ గుహల్లోకి చేరతాయి.
గడ్డకట్టే చలినుంచి తమను తాము రక్షించుకోడానికి ఓ 6 నెలలు పాటు గార్టర్ పాములు ఏకంగా 75 వేలకు పైగా అక్కడికి వచ్చి చేరతాయి. ఉష్టోగ్రతలు మామూలు స్థితికి వచ్చే వరకు లోపలే ఉండి.. ఆ తర్వాత తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడ రెడ్ సైడెడ్ గార్టర్ పాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సాధారణంగా ఇవి మనుషులతో ఇతర జంతువులతో ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. ఈ పాములకు విషం ఉండదు. అందుకే చాలామంది వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. నార్సిస్ పాముల గుహలకు మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది. 450 మిలియన్ ఏళ్ల క్రితం ఆ ప్రాంతం సముద్రపు నీటితో నిండి ఉండేది. చాలా రకాల సముద్ర జీవులు అక్కడ జీవించేవి. తర్వాతి కాలంలో కాల్షియం కార్బనేట్‌ను నీళ్లు పీల్చుకోవటం వల్ల గుహలు ఏర్పడ్డాయి. ఆ గుహలు కొన్ని మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ఇక, ఈ పాములను చూడ్డానికి జనం కూడా అక్కడకు వెళతారు. ఏప్రిల్, మే నెలలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ పర్యటిస్తూ ఉంటారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉండే రెడ్ సైడెడ్ స్నేక్స్‌కు విషం ఉండదు కాబట్టి.. పర్యాటకులు వాటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్ వాటే లైఫ్ వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

