క్లాస్‌ రూమ్‌లో స్టూడెంట్‌తో ఈ టీచర్‌ చేసిపనికి అంతా షాక్ !! మిగతా స్టూడెంట్స్‌ అందరూ చూస్తుండగానే ??

క్లాస్‌ రూమ్‌లో స్టూడెంట్‌తో ఈ టీచర్‌ చేసిపనికి అంతా షాక్ !! మిగతా స్టూడెంట్స్‌ అందరూ చూస్తుండగానే ??

Phani CH

|

Updated on: Jul 11, 2022 | 9:44 AM

రెండక్షరాల ప్రేమ పుట్టడానికి రెండు క్షణాలు చాలు.. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిపైన పుడుతుందనేది చెప్పడం కష్టం. అయితే ఈ ప్రేమ పుట్టినప్పుడు సమయం, సదర్భం చూసుకోకుండా వ్యక్తీకరించి ఇరుకుల్లో పడతారు కొందరు.

రెండక్షరాల ప్రేమ పుట్టడానికి రెండు క్షణాలు చాలు.. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిపైన పుడుతుందనేది చెప్పడం కష్టం. అయితే ఈ ప్రేమ పుట్టినప్పుడు సమయం, సదర్భం చూసుకోకుండా వ్యక్తీకరించి ఇరుకుల్లో పడతారు కొందరు. అలా ప్రేమ విషయంలో తొందరపడిన ఓ ఉపాధ్యాయుడు తన ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… అసోంలోని ధామాజీ పట్టణానికి చెందిన మనోజ్ కుంబంగ్.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఓ విద్యార్థినిపై మనసు పడ్డాడు. తన ప్రేమను ఆ యువతికి చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఓరోజు ధైర్యం చేసి విషయం ఆ యువతి ముందుంచాడు. అక్కడే దెబ్బతిన్నాడు పాపం.. ప్రేమ గురించి చెప్పడానికి ఏ పార్క్‌కో, ఆలయానికో తీసుకెళ్లి చెప్పాలికానీ.. ఈ టీచర్‌ క్లాస్‌ రూమ్‌లోనే అందరి విద్యార్ధుల ముందే చేతిలో పువ్వు పట్టుకుని మోకాళ్లపై కూర్చుని అమ్మాయి ఎదుట తన ప్రేమను బయటపెట్టాడు. ఈ సీన్‌ మొత్తం క్లాస్ రూంలోని మిగతా విద్యార్థులు చూస్తూ ఊరుకుంటారా.. వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయింది. పాపం ఆ టీచర్‌ ప్రేమకు ఆ అమ్మాయి ఎలాంటి రిప్లై ఇచ్చిందో తెలియదు కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో అతడి ఉద్యోగం ఊడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు మనోజ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే, ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. వీడియో తీసిన విద్యార్థులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బడికి వెళ్లాల్సిన వయసులో బతుకుబండి లాగుతూ.. మనసులు కదిలిస్తున్న చిన్నారి వీడియో

వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు !! హనీమూన్‌ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు

అప్పుడే ఇంట్లోకి వచ్చిన యజమాని.. వయ్యారంగా నడిచి వెళ్లి స్వాగతం చెప్పిన డాగీ

ఓర్నీ బండబడా.. ప్రాణమంటే అంత చులకనా.. ఈ డేంజర్‌ ప్రయాణం తగదంటున్న నెటిజనం

ఆరు పదుల వయసులోనూ అద్భుతమైన గొంతు.. అచ్చం లతా మంగేష్కర్‌లా

 

Published on: Jul 11, 2022 09:44 AM