బడికి వెళ్లాల్సిన వయసులో బతుకుబండి లాగుతూ.. మనసులు కదిలిస్తున్న చిన్నారి వీడియో
చాలా మంది చిన్నారులు చదువుకునే వయసులో స్కూల్ కు వెళ్లకుండా కుటుంబపోషణ కోసం బాల కార్మికులుగా మారుతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడల్లా అయ్యో పాపం అని అనిపిస్తుంది.
చాలా మంది చిన్నారులు చదువుకునే వయసులో స్కూల్ కు వెళ్లకుండా కుటుంబపోషణ కోసం బాల కార్మికులుగా మారుతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడల్లా అయ్యో పాపం అని అనిపిస్తుంది. ఇదిగో అలాంటిదే ఈ వీడియో కూడా. తాజాగా పొట్టకూటి కోసం ఐస్ క్రీం అమ్ముతున్న చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఐస్ క్రీం అమ్ముతున్నాడు. ఇంతలో అతని బండి గుంతలో పడిపోయింది. దానిని పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి, హ్యాండ్‌కార్ట్ తీయడంలో పిల్లవాడికి సహాయం చేసాడు. బండి బయటకు తీసిన తర్వాత ఆ వ్యక్తి ఒక ఐస్ క్రీం ఎంత అని అడిగాడు. ఆ చిన్నారి మాత్రం తనకు సహాయం చేసిన ఆ వ్యక్తికి కృతజ్ఞతగా ఒక ఐస్‌క్రీమ్ ఫ్రీగా ఇచ్చాడు. దానికి ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడు. ప్రతిగా వంద రూపాయల నోటు ఆ కుర్రాడికి ఇచ్చాడు. అంతేకాదు.. ఆ డబ్బును ఏం చేస్తావని ఆ బాలుడిని అడిగాడు.. నా కుంటుం పోషణ కోసం ఈ డబ్బును మా అమ్మకు ఇస్తాను సర్.. అన్నాడు. ఆ చిన్నారి ఆత్మవిశ్వాసానికి, అంత చిన్న వయసులో కుటుంబ భారాన్ని మోస్తున్న అతని బాధ్యతకు ముగ్ధుడైపోయాడు. ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని, చిన్నారిని తెగ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు !! హనీమూన్ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు
అప్పుడే ఇంట్లోకి వచ్చిన యజమాని.. వయ్యారంగా నడిచి వెళ్లి స్వాగతం చెప్పిన డాగీ
ఓర్నీ బండబడా.. ప్రాణమంటే అంత చులకనా.. ఈ డేంజర్ ప్రయాణం తగదంటున్న నెటిజనం
ఆరు పదుల వయసులోనూ అద్భుతమైన గొంతు.. అచ్చం లతా మంగేష్కర్‌లా
మూడు నెలల్లో 33 సార్లు.. ఈమె కటాల్సిన చలాన్ డబ్బుతో ఓ లగ్జరీ ఇల్లు కొనొచ్చట