800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగేసాయా? వీడియో
కొందరు వ్యాపారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అన్నెం పున్నెం ఎరుగని నోరులేని మూగజీవి ఎలుకపై తీవ్ర ఆరోపణలు చేసారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట. వ్యాపారులు చెప్పిన ఈ విచిత్రమైన సాకు విన్న అధికారులు అవాక్కయ్యారు. తమ షాప్‌లో ఉన్న ఎలుకలు ఏకంగా 800 బాటిళ్ల విదేశీ మద్యాన్ని తాగేశాయని అధికారులకు వివరించారు.
ఇది విని ఆశ్చర్యపోయిన అధికారులు నష్టపోయిన మద్యానికి పరిహారం చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి జార్ఖండ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. కొత్త విధానాన్ని అమలు చేయక ముందు, రాష్ట్ర యంత్రాంగం రాష్ట్రంలోని మద్యం నిల్వలను పరిశీలించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఎక్సైజ్ అధికారులు ధన్‌బాద్‌లోని బలియాపూర్‌లో ఉన్న దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఓ షాప్‌లో 800 ఖాళీ బాటిళ్లను గుర్తించారు. అధికారులను నిలదీసినప్పుడు వారు ఓ వింతైన సాకు చెప్పారు. ఎలుకలు బాటిల్ మూతలను నమిలేసి వాటిలోని మద్యాన్ని తాగేశాయని ఆరోపించారు. మద్యం నిల్వల కొరతను వారు ఎలుకలపై తోసేసారని వాటిపై నిందలు వేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో అక్రమంగా అమ్ముకున్న మద్యం తాలుకు పరిహారం ప్రభుత్వానికి చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :