Ratan Tata: రతన్ టాటాను కదిలించిన ఘటన.. పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు.!

|

Oct 14, 2024 | 12:52 PM

టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాకు మానవత్వమే కాదు జంతువుల పట్ల, ముఖ్యంగా కుక్కల పట్ల ప్రేమ, కరుణ ఉండేవి. పెంపుడు కుక్క ‘గోవా’ రతన్‌ టాటాకు కడసారి నివాళి అర్పించిన హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్‌ అయ్యింది. 11 ఏళ్ల కిందట రతన్‌ టాటా గోవా వెళ్లినప్పుడు తనను అనుసరించిన వీధి కుక్కను పెంచుకోవాలని నిర్ణయించి ముంబై తీసుకొచ్చారు.

టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాకు మానవత్వమే కాదు జంతువుల పట్ల, ముఖ్యంగా కుక్కల పట్ల ప్రేమ, కరుణ ఉండేవి. పెంపుడు కుక్క ‘గోవా’ రతన్‌ టాటాకు కడసారి నివాళి అర్పించిన హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్‌ అయ్యింది. 11 ఏళ్ల కిందట రతన్‌ టాటా గోవా వెళ్లినప్పుడు తనను అనుసరించిన వీధి కుక్కను పెంచుకోవాలని నిర్ణయించి ముంబై తీసుకొచ్చారు. బాంబే హౌస్‌లోని ఇతర కుక్కలతో పాటే గోవా కూడా పెరిగింది. ఆయన తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన కార్యాలయమైన బాంబేహౌస్‌లో వీధి శునకాల కోసం ఏకంగా ప్రత్యేక గదినే కేటాయించారు. అవి ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు.

వర్షాకాలం వచ్చిందంటే వాహనదారులకు ఆయన ఎప్పుడూ ఒక రిక్వెస్ట్ చేస్తుండేవారు. వానల్లో కార్ల కింద పిల్లులు, వీధి కుక్కలు తల దాచుకుంటుంటాయనీ కారు స్టార్ట్‌ చేసే ముందు దాని కింద ఒకసారి తనిఖీ చేసుకోండనీ చెప్పేవారు. లేకపోతే అవి తీవ్రంగా గాయపడటమో, అవయవాలను కోల్పోవడమో, చనిపోవడమో జరుగుతుందనీ కనుక వర్షాకాలంలో అంతా మూగజీవాల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని కోరేవారు. ఇక అడుగడుగునా రాజరికం ఉట్టిపడే తాజ్‌ హోటల్‌కు వెళ్లినప్పుడు ఓ వీధి శునకం ప్రవేశద్వారం పక్కనే నిద్ర పోవడానికి సంబంధించిన ఫొటోలు గతంలో వైరల్ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.