ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్‌తో

Updated on: Jan 05, 2026 | 7:32 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయ నదిలో మత్స్యకారులకు అరుదైన 'చూష చేప' లభించింది. తలపై గ్రిల్ లాంటి నిర్మాణంతో పెద్ద చేపలకు అతుక్కుని ఆహారం సేకరించే ఈ చేపను స్థానికంగా 'బిళ్ల చేప' అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఎఖనేస్‌ నాక్రటిస్‌. నదుల్లో ఇలాంటి వింత చేప దొరకడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.

సముద్రాల్లోనే కాదు, ఒక్కోసారి నదుల్లోనూ అరుదైన చేపలు కనిపిస్తుంటాయి. మత్స్యకారుల వలలో చిక్కినప్పుడు జనం వాటిని వింతగా చూస్తారు. ఇటీవల ఇలాంటి అరుదైన చేపలు జాలర్ల వలలో చిక్కుతున్నాయి. తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని మత్స్యకారులకు ఓ విచిత్రమైన చేప చిక్కింది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి బాడవలోని వైనతేయ నదిలో సోమవారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. రోజూమాదిరిగానే చేపల కోసం వల వేశారు. వలలో చిక్కిన చేపలలో ఓ విచిత్రమైన చేప మత్స్యకారులకు కనిపించింది. దాని తలపై గ్రిల్‌లాగా పొడవుగా ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తలపై జల్లెడలా, గ్రిల్‌లా ఉన్న ఆ భాగం సాయంతో తిమింగలాలు వంటి పెద్ద చేపలకు అతుక్కుపోతాయట. అలా వాటితోపాటు నీటిలో ఈదే పనిలేకుండా.. ఆహారం వెతుక్కునే శ్రమ లేకుండా ఆ భారీ చేపలు తినగా వదిలేసిన ఆహారాన్ని తింటూ జీవిస్తాయట. ఈ చేపలను చూష చేపలని, బిళ్ల చేపలని కూడా పిలుస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే దీనికి శాస్త్రీయ నామం ఎఖనేస్‌ నాక్రటిస్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ‘చిట్టి’ పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

జ్యోతిష్య శాస్త్రంలో శుభయోగాలు ఇవే.. ఏ యోగానికి ఏ ఫలితమో తెలుసా?

నిద్రలో గొంతును నులిమింది ఎవరు.. అది దెయ్యం పనేనా

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో

రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??