అరుదైన దృశ్యం.. ఒకే చోట మూడు పాముల ‘సయ్యాట’

Updated on: May 19, 2026 | 4:46 PM

విజయనగరం జిల్లా మద్దివలస గ్రామంలో ఒకేసారి మూడు పాములు పెనవేసుకుని గంటల పాటు చేసిన విన్యాసాలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. విషపూరిత పాములు కావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ అరుదైన దృశ్యాన్ని పలువురు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ‘మూడు పాముల సయ్యాట’ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా రెండు పాములు పెనవేసుకోవడం చూస్తుంటాం. కానీ, విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో అత్యంత అరుదైన దృశ్యం ఒకటి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకేసారి మూడు పాములు జతకట్టి గంటల తరబడి చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన రైతు శివ్వాల ఫకీరు నాయుడుకు చెందిన కల్లం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు పాములు ఒకదానికొకటి పెనవేసుకుంటూ, గాలిలోకి లేస్తూ వింతగా కదలడాన్ని గమనించిన స్థానికులు విస్తుపోయారు. సాధారణంగా రెండు పాములు జతకట్టడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మూడు పాములు ఒకేసారి ఇలా కనిపించడం చాలా అరుదని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. అవి విషపూరితమైన పాములు కావడంతో గ్రామస్థులు, కూలీలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కొందరు యువకులు వాటిని కదిలించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రమాదాన్ని పసిగట్టిన పెద్దలు వారిని అడ్డుకున్నారు. సుమారు గంటకు పైగా ఆ ప్రాంతంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు ఆ పాములు సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని పలువురు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం మద్దివలస గ్రామంలో ఈ ‘మూడు పాముల సయ్యాట’ హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం

Follow Us