Rare Wolf: ప్రపంచాన్ని కలవరపరిచిన వింత జంతువు..! నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..
జంతువులకు సంబంధించిన ప్రతిదీ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఓ వింత జంతువు కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
జంతువులకు సంబంధించిన ప్రతిదీ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఓ వింత జంతువు కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది చూసేందుకు నక్క, తోడేలుకు దగ్గరి రూపంతో విచిత్రంగా దర్శనమిచ్చింది. ఈ వింతైన జంతువుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రశాంతంగా రోడ్డు దాటుతున్న ఆ జంతువును చూస్తే.. మొదట తోడేలులా కనిపించినా.. నిశితంగా పరిశీలిస్తే అది నక్కలా అనిపిస్తుంది. ఇది ఏ జాతికి చెందినదో ఇప్పటికీ తెలియదు. ఈ అసాధారణ జంతువు దక్షిణ అమెరికాలో రోడ్డు దాటుతుండగా అనుకోకుండా అక్కడి స్థానికుల కెమెరాకు చిక్కింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి.. ‘ఇది ఏంటో ఎవరికైనా తెలుసా?! అని ప్రశ్నిస్తూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లు షాకవుతున్నారు. కాగా, ఇది రాత్రిపూట మాత్రమే తిరిగే జీవిగా భావిస్తున్నారు. ఇది చిన్న జంతువులు, కీటకాలు, మొక్కలను తినే ఒంటరి జంతువు మేన్డ్ వోల్ఫ్ అయ్యిండవచ్చని చెబుతారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

