కాలజ్ఞాన మహిమ.. నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపుంజు
సాధారణంగా పక్షులకు రెండు కాళ్లు ఉంటాయి. కోళ్లు కూడా పక్షి జాతికి చెందినవే కనుక వీటికి కూడా రెండు కాళ్లు ఉండటం సహజం. సాధారణంగా జంతువులకే నాలుగు కాళ్లు ఉంటాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మనుషులు వింత వింత ఆకారాల్లో పుట్టడం, పశువులకు మనిషి పోలికల్లో ఉన్న దూడలు పుట్టడంలాంటి ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ కోడిపుంజు నాలుగు కాళ్లతో పుట్టింది. ఈ నాలుగు కాళ్ల కోడి పుంజు ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవును ఈ విచిత్ర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారి గూడెం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం తన తోటలో పుంజుల పెంపకం ప్రారంభించాడు, వేరే ప్రాంతం నుండి కోడి పిల్లలను కొని తెచ్చి వాటిని పెంచుతున్నాడు. వాటిలో ఓ కోడిపిల్ల విచిత్రం గా ఉండటంతో దానిని ప్రత్యేక శ్రద్దతో పెంచాడు. ఆ కోడిపిల్లకు నాలుగు కాళ్లు ఉండటం గమనించాడు. ఇదేదో వింతగా ఉందని భావించిన ప్రసాద్ దాని ప్రవర్తనలో ఏమైనా తేడా ఉందేమో అని గమనించాడు. కానీ ఆ కోడిపుంజు అన్నింటిలాగే ఎంతో హుషారుగా ఆరోగ్యంగా పెరగడంతో ప్రసాద్ ఇంట్లో ఆ కోడిపుంజు ప్రత్యేకంగా నిలిచింది. కొన్నిరోజుల్లో సంక్రాంతి రాబోతోంది. దీంతో కొంతమంది కోడిపుంజుల కోసం ప్రసాద్ వద్దకు రావడం.. ఈ నాలుగు కాళ్ల పుంజును చూసి విచిత్రంగా చెప్పుకోవడంతో చుట్టుపక్కల గ్రామాలవాళ్లకీ విషయం తెలిసింది. ఈ కోడిపుంజును చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పినట్లే జరుగుతోంది అంటూ చుట్టపక్కల గ్రామాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది ఈ కోడిపుంజు మ్యాటర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజనీ-కమల్ కాంబోలో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య, శ్రుతి
పాతిక చిత్రాల కౌంట్ తో దూసుకుపోతున్న రష్మిక
ఫస్ట్ అటెంప్ట్ తో ఆకట్టుకుంటున్న కెప్టెన్స్
