గ్యాంగ్ రేప్ వల్ల గర్భం .. 27 ఏళ్ళ తర్వాత.. తండ్రిని అరెస్ట్ చేయించిన కొడుకు
1994లో ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె ఒక బాబును ప్రసవించింది. బాలిక తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చేశారు.
1994లో ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె ఒక బాబును ప్రసవించింది. బాలిక తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చేశారు. ఆమెకు వెంటనే పెళ్లి చేశారు. పదేళ్ల తర్వాత గ్యాంగ్ రేప్ సంగతి తెలిసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు తన తల్లి గురించి తెలుసుకున్న కుమారుడు అసలైన తండ్రి కోసం కోర్టును ఆశ్రయించాడు. దీంతో గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒక వ్యక్తి అతడి తండ్రిగా డీఎన్‌ఏ టెస్ట్‌లో తేలింది. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకెళితే.. పెద్దవాడైన ఆ మహిళ కుమారుడు తల్లిని కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరని అడిగాడు. జరిగిన సంగతి ఆ తల్లి చెప్పింది. దీంతో తన తండ్రి ఎవరన్నది అతడు తెలుసుకోవాలనుకున్నాడు. దీనిపై కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరపడంతో గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు గుర్తించారు. వారికి డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకరైన గుడ్డు 27 ఏళ్ల వ్యక్తి తండ్రిగా తేలింది. దీంతో పోలీసులు అతడ్ని ఇటీవల అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
16 గంటలు బోటు కిందే .. బతుకుజీవుడా అనుకుంటూ..
Macherla Niyojakavargam: ఒక్క రాత్రితో నితిన్ కెరీరే మారిపోయిందిగా
Jr NTR: కాలర్ ఎగరేయండ్రా మామ !! ఆస్కార్ బరిలో NTR
Liger: చెన్నైలో లైగర్ టీమ్ సందడి.. విజయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే
Mahesh Babu: లవింగ్ ది న్యూ వైబ్.. నెట్టింట రచ్చ చేస్తున్న మహేష్ పోస్ట్