మైక్ లో బంధువులు ఇచ్చిన కానుకలన్నీ చదివి వినిపించిన దృశ్యాలు నెట్లో వైరల్ అయ్యాయి. సుమారు 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల వరకు వాటి విలువ ఉండొచ్చని తెలుస్తుంది. ఆ వివాహానికి పెద్ద ఉరేగింపులా వచ్చిన వధువు బంధువులు నాలుగు సూట్ కేసుల్లో బహుమతులు తీసుకొచ్చారు. వంద కార్లు, నాలుగు లగ్జరీ బస్సుల్లో వచ్చి ఈ బహుమతులు అందజేశారు. ఇదంతా రాజ కుటుంబ పెరేడ్ లా అనిపించిందని స్థానికులు తెలిపారు. అలాగే వివాహానికి వచ్చిన వారికి వెండి నాణ్యాలు పంచారు. ఇటీవల జరిగినట్లుగా తెలుస్తున్న పెళ్లి తంతులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వరుడి కుటుంబం అంత కరీదైన బహుమతులు స్వీకరించడం, తమ సంపదను ఇలా ప్రదర్శించడం వల్ల ఇతరులపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని విమర్శలు చేస్తున్నారు.