అదృష్టం అంటే ఇదే.. లక్కీ డ్రాలో పావుకేజీ బంగారం

Updated on: Nov 09, 2025 | 3:24 PM

అదృష్టం అనేది మనిషి జీవితాన్ని క్షణాల్లో మార్చేస్తుంది. లక్కుంటే.. లచ్చిందేవి తలుపు తట్టి మరీ వెళ్లి మరీ పలకరిస్తుంది. కడు పేదవాడిని కోటీశ్వరుడ్ని చేస్తుంది. అందుకు ఉదాహరణే రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన. లాటరీలో ఓ కూరగాయల వ్యాపారి రూ.11 కోట్లు గెలుచుకున్నాడు. అతడు ఎంతకూ కాంటాక్ట్ లోకి రాకపోవటంతో , లాటరీ నిర్వాహకులు అతని ఇంటి అడ్రస్‌ వెతుక్కుంటూ వెళ్ళిమరీ అతనికి బహుమతి అందించారు.

అదృష్టం అనేది మనిషి జీవితాన్ని క్షణాల్లో మార్చేస్తుంది. లక్కుంటే.. లచ్చిందేవి తలుపు తట్టి మరీ వెళ్లి మరీ పలకరిస్తుంది. కడు పేదవాడిని కోటీశ్వరుడ్ని చేస్తుంది. అందుకు ఉదాహరణే రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన. లాటరీలో ఓ కూరగాయల వ్యాపారి రూ.11 కోట్లు గెలుచుకున్నాడు. అతడు ఎంతకూ కాంటాక్ట్ లోకి రాకపోవటంతో , లాటరీ నిర్వాహకులు అతని ఇంటి అడ్రస్‌ వెతుక్కుంటూ వెళ్ళిమరీ అతనికి బహుమతి అందించారు. ఇదంతా చూసిన జనం.. ఇదిరా లక్కంటే అంటున్నారు. రాజస్థాన్‌లోని కోటపుత్లీ పట్టణానికి చెందిన అమిత్ అనే వ్యక్తి ..రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చేతిలో కాస్త డబ్బు ఉన్నప్పుడు.. అదృష్టం కలిసిరాకపోతుందా అనే ఆశతో లాటరీ టికెట్లు కొంటుండేవాడు. అలా ఈ ఏడాది దీపావళి సందర్భంగా అమిత్ పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ టికెట్లు కొనాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పంజాబ్‌లోని భఠిండా నగరానికి వెళ్లి..ఒక్కొక్కటి రూ. 1000 చొప్పున రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఇంటికి చేరాడు. తర్వాత ఎప్పటిలాగే కూరగాయలు అమ్ముకునే పనిలో బిజీ అయ్యాడు. అదే సమయంలో అతని మొబైల్‌ ఫోన్‌కూడా పనిచేయడం మానేసింది. దానిని బాగు చేయించుకునేందుకూ చేతిలో డబ్బు లేకపోవటంతో దానిని పక్కనపడేశాడు. ఇదిలా ఉండగా లాటరీ ఫలితాలు రానే వచ్చాయి. ఆ లక్కీ డ్రాలో..అమిత్ కొన్న టికెట్‌కు బంపర్ ప్రైజ్ వచ్చింది. ఈ ముచ్చటే అతడికి చెబుతామని లాటరీ నిర్వాహకులు అమిత్‌ ఫోన్‌కి కాల్‌ చేశారు. కానీ, ఫోన్‌ పనిచేయకపోవడంతో విషయం చెప్పే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో, నాలుగు రోజుల తర్వాత పంజాబ్ లాటరీ శాఖ అధికారులు.. ఎలాగోలా అతడి అడ్రస్ పట్టుకుని చివరకు అతనిని సంప్రదించారు. లాటరీలో రూ. 11 కోట్లు గెలిచిన సంగతి అతడికి చెప్పేశారు. దీంతో అమిత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే ఇంట్లో ఉన్న టికెట్లు తీసుకుని, భార్యా పిల్లలతో కలిసి పంజాబ్ వెళ్లి.. ఆ లాటరీ కార్యాలయంలో ఇచ్చి ప్రైజ్ క్లెయిమ్ చేశారు. ఈసందర్భంగా అమిత్‌ మాట్లాడుతూ..ఒక స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని ఆయన ఈ టికెట్‌ కొన్నానని అమిత్ చెప్పుకొచ్చారు. అడగగానే.. తనకు రెండు వేలు అప్పుగా ఇచ్చిన తన స్నేహితుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారిద్దరి పేరిట తనకొచ్చిన రూ. 11 కోట్ల నుంచి.. చెరో రూ. 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని అమిత్ చెప్పుకొచ్చాడు. ఇక.. తన పిల్లల చదువుకు ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పుకొచ్చాడు. కాగా, నిన్నటిదాకా కూరగాయలు అమ్ముకుంటూ బతికిన తమ బంధువు అమిత్.. ఇలా కోటీశ్వరుడు కావటంతో అతని బంధువులు,కుటుంబ సభ్యులంతా సంతోషంలో మునిగిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దమ్ముంటే రా పట్టుకో.. కుక్కకు పక్షి సవాల్‌

ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కేజీల బంగారం కొనుగోలు

ఢిల్లీకి సాయం చేస్తామన్న చైనా.. మన రిప్లయ్ పై ఉత్కంఠ

ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..

Safety Pin: పిన్నీసు ధర రూ. 69 వేలు ??