పాక్ మహిళతో మిలటరీ ఉద్యోగి వాట్సప్ చాటింగ్..  వెలుగులోకి షాకింగ్ విషయాలు.. వీడియో

పాక్ మహిళతో మిలటరీ ఉద్యోగి వాట్సప్ చాటింగ్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. వీడియో

Phani CH

|

Updated on: Oct 20, 2021 | 9:46 AM

అత్యంత బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి అసభ్యంగా ప్రవర్తించాడో మిలిటరీ ఉద్యోగి. దేశాన్ని రక్షించాల్సిన అతడు దేశద్రోహిగా మారాడు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఓ మిలటరి ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.

అత్యంత బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి అసభ్యంగా ప్రవర్తించాడో మిలిటరీ ఉద్యోగి. దేశాన్ని రక్షించాల్సిన అతడు దేశద్రోహిగా మారాడు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఓ మిలటరి ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళతో.. ఉద్యోగి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని మిలటరీ ఇంజనీర్ సర్వీస్ ఎంఈఎస్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి.. పాకిస్తాన్‌కు గుఢాచర్యం చేశాడని నిర్ధారించినట్లు పోలీసులు అక్టోబరు14న తెలిపారు. మిలటరీ కార్యాలయంలో గజేంద్రసింగ్ నాల్గవతరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గజేంద్రసింగ్ పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకొని ఆమెతో తరచూ వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో జైపూర్ పోలీసులు గజేంద్రసింగ్‌పై నిఘా పెట్టారు.. మిలటరీ ఇంజినీరింగ్ కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లు, లేఖలను తన మొబైల్ ఫోన్‌తో క్లిక్ చేసి వాటిని వాట్సాప్‌లో పాక్ మహిళకు పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: డియోడ్రెంట్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో

Viral Video: విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకున్న పావురం.. పోలీసులు ఏంచేశారంటే..?? వీడియో