పని మనిషిలా వస్తుంది.. ఇల్లంతా దోచేస్తుంది

|

Aug 23, 2024 | 10:00 PM

వృద్ధులే ఆమె టార్గెట్‌. తీయని మాటలు చెప్పి వారితో పరిచయం పెంచుకుంటుంది. పెద్ద వారంటే ఎంతో గౌరవం అన్నట్టు తన బిహేవియర్‌తో బుట్టలో వేసుకుంటుంది. వంట, ఇతర పనుల్లో సాయంగా ఉంటానంటూ నెమ్మదిగా ఇంట్లో పాగా వేస్తుంది. అదును చూసి యజమానులకు ఆహారం, పానీయాల్లో నిద్రమాత్రలు కలిపి బంగారం, నగదు అందినకాడికి దోచుకుని పరారవుతుంది. ఇలా తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 18 దొంగతనాలకు పాల్పడింది.

వృద్ధులే ఆమె టార్గెట్‌. తీయని మాటలు చెప్పి వారితో పరిచయం పెంచుకుంటుంది. పెద్ద వారంటే ఎంతో గౌరవం అన్నట్టు తన బిహేవియర్‌తో బుట్టలో వేసుకుంటుంది. వంట, ఇతర పనుల్లో సాయంగా ఉంటానంటూ నెమ్మదిగా ఇంట్లో పాగా వేస్తుంది. అదును చూసి యజమానులకు ఆహారం, పానీయాల్లో నిద్రమాత్రలు కలిపి బంగారం, నగదు అందినకాడికి దోచుకుని పరారవుతుంది. ఇలా తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 18 దొంగతనాలకు పాల్పడింది. గతంలో పది కేసుల్లో శిక్ష పడి జైలుకు వెళ్లినా మళ్లీ అదే తీరు. డీఎస్పీ భవ్యకిషోర్‌ సోమవారం కేసు వివరాలను రాజమహేంద్రవరంలో వెల్లడించారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్‌ బుజ్జికి వివాహం అయి, భర్త మరణించాడు. ప్రస్తుతం ఆమె రాజమహేంద్రవరం లోని బొమ్మూరులో ఉంటోంది. వృద్ధులతో పరిచయం పెంచుకుని వారి ఇళ్లలో పనిమనిషిగా చేరుతుంది. నమ్మకం కుదిరిన తర్వాత కొన్నాళ్లకు అన్నం, ప్రసాదం, పానీయాల్లో మత్తు మాత్రలను అధిక మోతాదులో కలిపి నిద్రలోకి జారుకున్నాక వారి ఒంటిపై నగలతోపాటు ఇంట్లోని బంగారం, నగదు దోచుకుపోతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాంప్‌ పేరుతో మైనర్ బాలికలపై లైంగిక దాడి

Follow us on