Train Drivers: రైలు డ్రైవరు నెత్తిన పేలుడు పదార్థం..! రైల్వే బోర్డు నిర్ణయం..

|

Aug 29, 2023 | 7:51 AM

రైల్వే బోర్డు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో లోకో పైలట్లు పేలుడు పదార్థాలను తమ వెంట మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలాసోర్‌ రైలు ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చేపడుతున్న మార్పుల్లో విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు లోకోపైలట్‌కు సంబంధించిన పెట్టెలో డిటోనేటర్లు ఉండేవి. ఈ పెట్టెను బాక్స్‌బాయ్‌ ఇంజిన్‌లో పెట్టేవారు. ఇప్పుడు బాక్స్‌బాయ్‌ విధానాన్ని తీసివేసి ఆ పెట్టెలో ఉన్న పనిముట్లు..

రైల్వే బోర్డు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో లోకో పైలట్లు పేలుడు పదార్థాలను తమ వెంట మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలాసోర్‌ రైలు ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చేపడుతున్న మార్పుల్లో విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు లోకోపైలట్‌కు సంబంధించిన పెట్టెలో డిటోనేటర్లు ఉండేవి. ఈ పెట్టెను బాక్స్‌బాయ్‌ ఇంజిన్‌లో పెట్టేవారు. ఇప్పుడు బాక్స్‌బాయ్‌ విధానాన్ని తీసివేసి ఆ పెట్టెలో ఉన్న పనిముట్లు లోకోపైలట్లే తమ బ్యాగులో తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో పనిముట్లతో పాటు డిటోనేటరు కూడా ఉండటంతో భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని సార్లు ఆలస్యం అయినప్పుడు పనిముట్లు ఉండే బ్యాగును లోకోపైలట్లు నేరుగా ఇంటికి తీసుకెళ్తుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ డిటోనేటర్‌ ఇంట్లో పేలితే వారి కుటుంబానికే కాకుండా చుట్టుపక్కల వారికీ ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి లోకోపైలట్‌ వద్ద డిటోనేటరు ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగి తాను నడుపుతున్న రైలు ఆగిపోతే ఆ పట్టాలపై వచ్చే మరో రైలుకు ఆయన సంకేతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎదురుగా వెళ్లి పట్టాల మీద డిటోనేటర్‌ పెడతారు. దానిపై నుంచి రైలు వెళ్లినప్పుడు ఆ ఒత్తిడికి డిటోనేటర్‌ పేలి పెద్ద శబ్దం చేస్తుంది. ఇది ప్రమాదసూచికగా భావించి ఆ లోకోపైలట్‌ రైలును నిలిపి వేస్తారు. తాజాగా రైల్వే దీని పేరు మార్చి రైల్వే అలారం అని పెట్టింది. పెద్ద శబ్దం చేసి రైలును ఆపుతుంది కాబట్టి అలారంగా పేర్కొంటున్నారు. వాకీటాకీల ద్వారా సమాచారం పంపలేని పరిస్థితుల్లో డిటోనేటర్లు వాడుతారు. అయితే ఈ విషయంపై రైల్వే అధికారులను వివరణ కోరగా రైల్వే బోర్డు నిర్ణయం అమలు చేస్తున్నామని చెబుతున్నారు. పైగా డిటోనేటర్‌ పైన పెద్ద మొత్తంలో బరువు పడితేనే అది పేలుతుంది కాబట్టి ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు. లోకోపైలట్లు పనిముట్లు, డిటోనేటరు, తన భోజనం బ్యాగును రైలు పట్టాల మధ్య మోసుకెళ్లలేకపోతున్నారని.. ఇది అనాలోచిత నిర్ణయమని ఆల్‌ ఇండియా లోకోరన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ డివిజనల్‌ అధ్యక్షుడు ఏవీఎస్‌ఎన్‌ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..