Python viral video: రోడ్డుకు అడ్డంగా భారీ పైథాన్.. హడలెత్తిపోయిన వాహనదారులు ఏంచేశారో చూడండి..(వీడియో)
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ కొండ చిలువకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ కొండ చిలువకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న కొండ చిలువను చూసి.. వాహనదారులంతా షాకయ్యారు. అయితే.. రోడ్డుపై అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. వేగంగా వాహనాల వల్ల కుక్కల నుంచి చాలా జంతువులు బలి అవుతున్నాయి. అయితే.. కొంతమంది వల్ల పలు జీవులు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడుతున్నాయి. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో డ్రైవర్ల అవగాహనకు ప్రజలు ప్రశంసిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో కేరళలోని కొచ్చికి సంబంధించినది. సీపోర్ట్-ఎయిర్‌పోర్ట్ రహదారిపై ఒక భారీ కొండచిలువ కనిపించింది. అది నెమ్మదిగా రోడ్డు దాటుతోంది. అతడిని చూసి కొందరు డ్రైవర్లు తమ వాహనాలను ఆపి కొండచిలువ రోడ్డు దాటేంత వరకు అక్కడే నిలుచున్నారు. దీన్ని చూసి నెటిజన్లంతా వారి వాహనదారుల సమయస్ఫూర్తికి ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైరల్ అవుతున్న 1.47 నిమిషాల నిడివి గల వీడియోలో ఓ భారీ కొండచిలువ రోడ్డు దాటడాన్ని చూడవచ్చు. కాగా ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు బాటసారులు కొండచిలువ సురక్షితంగా రోడ్డు దాటేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చివరగా, కొండచిలువ సురక్షితంగా రహదారికి అవతలి వైపుకు చేరుకుంది. దీంతో మళ్లీ ట్రాఫిక్ తిరిగి పున:ప్రారంభమైంది.