తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులతో ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. CT స్కాన్ చేయగా

Updated on: Feb 25, 2025 | 6:14 PM

సిజేరియన్ ఆపరేషన్ సమయంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు చేసిన పొరపాటు కారణంగా ఓ గర్భిణీ స్త్రీ 20 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడింది. చివరాఖరికి ఆమె అనారోగ్యానికి గల అసలు కారణం బయటపడటంతో.. కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దక్షిణ కర్ణాటకలోని పుత్తూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

2004, నవంబర్ 27న ఆర్యాపు గ్రామం బంగారుడ్కలో నివాసముంటున్న శరణ్య లక్ష్మీ ప్రసవం కోసం పుత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అక్కడున్న డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. తద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెను డిసెంబర్ 2వ తేదీన డిశ్చార్జ్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. డిశ్చార్జ్ అనంతరం.. ఆమె తీవ్రమైన జ్వరంతో రోజుల తరబడి బాధపడింది. ఈ విషయమై డెలివరీ చేసిన డాక్టర్‌ను అడగ్గా.. సదరు మహిళకు అతడు జ్వరం మందు రాసిచ్చాడు. ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గలేదు. పైగా ఈసారి కీళ్ల నొప్పులు రావడం కూడా మొదలయ్యాయి. దీంతో మంగళూరులోని ఓ పెద్దాసుపత్రికి సదరు మహిళను తీసుకెళ్లారు కుటుంబీకులు. అక్కడ అసలు విషయం బయటపడింది. సదరు మహిళకు అక్కడి డాక్టర్లు CT స్కాన్ చేయగా.. కడుపులో సర్జికల్ క్లాత్ ఉన్నట్టు తేలింది. సిజేరియన్ జరిగి నెలన్నర కావడం.. అప్పటిదాకా క్లాత్ కడుపులోనే ఉండిపోవడంతో.. మహిళ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి.. సర్జికల్ క్లాత్ తొలగించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు మహిళ భర్త. తన భార్య మూడు నెలలుగా మానసికంగా, శారీరకంగా తీవ్ర వేదన అనుభవించిందని.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెక్సికో తీరంలో డూమ్స్‌ డే ఫిష్‌ కలకలం.. రాబోయే ప్రళయానికి సంకేతమా

ఇక ఏడాదికి 2 సార్లు.. 10, 12 తరగతుల పరీక్షలు!

ఆమెను అంతరిక్షంలో వదిలివేయాలనుకున్నారు ??

గోరు వెచ్చని నీళ్లను తాగితే ఎన్నో లాభాలు

ఇంత వెధవల్లా ఉన్నారేంట్రా! కుంభమేళాలో మహిళల స్నానం