Puneeth Rajkumar Daughter: ఆ గుండెనే… మోసం చేసింది నాన్న..! తండ్రి భౌతికఖాయం వద్ద పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి.. (వీడియో)

|

Nov 08, 2021 | 9:31 AM

గుండెలను గుడిగా చేసిన నాన్నిక లేడని తెలిసి పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి తల్లడిల్లిపోయింది. తమకోసమే తపించిన ఆ గుండెనే తమను మోసం చేసిందని తెలిసి... కన్నీటి పర్యంతమైంది. నవ్వుతూ పలకరించే నాన్న... విగతజీవిగా పడిఉండడం చూసి నిశ్చేష్టురాలైంది


అమెరికా నుంచి వచ్చి తండ్రిని విగత జీవిగా చూసి కన్నీటి పర్వంతమయింది ధృతి. తల్లిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో ఆ తల్లి కూతుళ్లను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తండ్రి భౌతికకాయంపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా.. నీవు ఇక మాకు కనిపించవా అంటూ బోరున విలపించారు.

అంతకు ముందు అమెరికా నుంచి డైరెక్ట్‌గా వచ్చిన ధృతి.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక కాన్వాయ్‌లో ఇంటికి చేరుకొని.. ఆ వెంటనే తండ్రి భౌతికకాయం ఉన్న కంఠీరవ స్టేడియానికి వచ్చారు. వచ్చీ రాగానే ఒక్కసారిగా తండ్రి పునీత్ పార్ధీవదేహంపై పడి విలపించారు. కుంటుంబ సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా పునీత్ అంత్యక్రియలు ఇవాళ అంటే అక్టోబర్‌ 31న ఉదయం జరిగాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య కంఠీరవ స్టూడియోలో పునీత్ పార్ధీవ దేహాన్ని పాతిపెట్టారు.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…