ఆఫీస్‌ లో మీటింగ్ అయ్యింది.. కట్ చేస్తే బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన టెకీ

Updated on: Aug 05, 2025 | 5:02 PM

సాఫ్ట్ వేర్ రంగంలో పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. పుణెలోని ఓ ఆఫీస్ లో జరుగుతున్న మీటింగ్ కు హాజరైన ఓ టెకీ.. మీటింగ్ మధ్యలో బయటకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నట్లుండి తన ఆఫీస్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి అంతా షాకయ్యారు..

నాసిక్‌కు చెందిన పీయూష్‌ కవాడె అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ పుణెలోని హింజెవాడి ఐటీ పార్క్‌లోని అట్లాస్ కాప్కో సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది జులై నుంచి అతడు ఇదే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పీయూష్‌ ఆఫీస్‌లో జరుగుతున్న మీటింగ్‌కు హాజరయ్యాడు. అయితే మధ్యలో ఛాతి నొప్పిగా ఉందని చెప్పి మీటింగ్‌ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఆఫీస్‌ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హింజావాడి ఫేజ్ 2లో జరిగిన ఈ ఘటన పై టెకీలు భయపడిపోయారు. ఓ సూసైడ్‌ నోట్‌ కూడా లభ్యమైంది. తను మంచి కొడుకు అయితే బాగుండేదని జీవితంలో ప్రతి విషయంలో విఫలమయ్యాననీ, తనను క్షమించాలని పియూష్‌ పేరంట్స్‌ని ఉద్దేశించి నోట్‌ రాసాడు. వారికి కొడుకుగా ఉండే అర్హత తనకు లేదని రాసినట్లు పోలీసులు తెలిపారు. పీయూష్‌ మృతికి ఉద్యోగంలో ఒత్తిడి కారణమా వేరే ఇతర కారణలున్నాయా అన్నది విచారణ తర్వాత వెల్లడిస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంటి చూపుతోనే పేమెంట్స్..! UPI కొత్త ఫీచర్..