Divorce: హ‌నీమూన్ ట్రిప్.. గోవాకు బ‌దులుగా అయోధ్య‌కు.. విడాకులు కోరిన భార్య‌.

|

Jan 29, 2024 | 10:49 AM

భోపాల్‌లో ఓ భ‌ర్త త‌న భార్య‌ను హ‌నీమూన్‌కు గోవాకు తీసుకెళ్తాన‌ని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్ల‌కుండా అయోధ్య‌, వార‌ణాసికి తీసుకెళ్లాడు. దీంతో త‌న భ‌ర్త నుంచి భార్య విడాకులు కోరింది. వివ‌రాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఐటీ రంగంలో ప‌ని చేస్తున్నాడు. సంపాద‌న కూడా బాగానే ఉంది. అయితే హ‌నీమూన్‌కు విదేశాల‌కు వెళ్దామ‌ని భ‌ర్త‌ను భార్య కోరింది. కానీ త‌న త‌ల్లిదండ్రుల‌ను చూసుకునే వారు లేర‌ని,

భోపాల్‌లో ఓ భ‌ర్త త‌న భార్య‌ను హ‌నీమూన్‌కు గోవాకు తీసుకెళ్తాన‌ని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్ల‌కుండా అయోధ్య‌, వార‌ణాసికి తీసుకెళ్లాడు. దీంతో త‌న భ‌ర్త నుంచి భార్య విడాకులు కోరింది. వివ‌రాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఐటీ రంగంలో ప‌ని చేస్తున్నాడు. సంపాద‌న కూడా బాగానే ఉంది. అయితే హ‌నీమూన్‌కు విదేశాల‌కు వెళ్దామ‌ని భ‌ర్త‌ను భార్య కోరింది. కానీ త‌న త‌ల్లిదండ్రుల‌ను చూసుకునే వారు లేర‌ని, ఇండియాలోనే ఏదైనా ప్ర‌దేశానికి వెళ్దామ‌ని భ‌ర్త చెప్పాడు. దీంతో గోవాకు వెళ్దామ‌ని ఇద్ద‌రూ నిర్ణ‌యించుకున్నారు.

కానీ భ‌ర్త స‌డెన్‌గా త‌న ప్లాన్ మార్చాడు. అయోధ్య రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి వెళ్లాల‌ని కుమారుడిని త‌ల్లి కోరింది. దీంతో అత‌ను అయోధ్య‌కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు. ఇక చేసేదేమీ లేక భార్య త‌న భ‌ర్త వెంట వెళ్లింది. అయోధ్య‌, వార‌ణాసి ట్రిప్ ముగిశాక భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఇంటికి తిరిగొచ్చారు. హ‌నీమూన్ ట్రిప్ గోవాకు బ‌దులుగా అయోధ్య‌, వార‌ణాసికి మార‌డంతో భార్య తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ఆమె త‌న భ‌ర్త నుంచి విడాకులు కావాల‌ని కోరుతూ శుక్ర‌వారం ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇక త‌న కంటే కుటుంబ స‌భ్యుల‌కే త‌న భ‌ర్త అధిక ప్రాధాన్య‌త ఇస్తాడ‌ని భార్య పిటిష‌న్‌లో పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos