Viral Video: కథ బాగుంది.. మనం సిన్మా తీస్తున్నాం.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుంది..!

|

May 26, 2022 | 10:06 AM

‘‘నీ కథ బాగుంది... సినిమా తీసేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయి... కథను మరింత బాగా రాద్దాం దీని కెసం మనం రాత్రుళ్లు చర్చించుకుందాం... ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది..


‘‘నీ కథ బాగుంది… సినిమా తీసేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయి… కథను మరింత బాగా రాద్దాం దీని కెసం మనం రాత్రుళ్లు చర్చించుకుందాం… ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.. అక్కడ నా కోర్కెలు తీర్చలేదనుకో.. సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకుండా చేస్తా’’ అంటూ మహిళా కథా రచయితను బెదిరించిన సినీ నిర్మాతపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వైఖరితో భయపడిన బాధితురాలు ‘షి’బృందానికి ఫిర్యాదు చేయగా… ఆమెను భరోసా కేంద్రానికి పిలిపించారు. డీసీపీ శిరీష రాఘవేంద్ర స్వయంగా బాధితురాలితో మాట్లాడి గోల్కొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయించారు. హైదరాబాద్‌లో ఉంటున్న మహిళా కథా రచయిత తన వద్ద ఉన్న కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరునెలల క్రితం ఒక సినీ నిర్మాత ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. విభిన్న కథలు, సంఘటనలను సినిమాలుగా తీస్తానని, ఖర్చు ఎంతైనా ఇబ్బంది లేదంటూ మహిళా రచయితకు చెప్పాడు. కథ, సన్నివేశాల కాపీని ఆమె నిర్మాతకు అందజేశారు. కథను చదువుతానంటూ చెప్పిన నిర్మాత ఆమె ఫోన్‌ చేసినప్పుడల్లా తర్వాత మాట్లాడదాం అనేవాడు. కొద్దిరోజుల క్రితం అతడే ఆమెకు ఫోన్‌ చేశాడు. కథ బాగుంది.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుదని అన్నాడు. అప్పటి నుంచి వరుసగా రాత్రుళ్లు ఫోన్లు చేసి లైంగిక కోర్కెలు తీర్చాలని.. లేదంటే నీకు ఒక్క సినిమాకు రాయకుండా అడ్డుకుంటానంటూ బెదిరించాడు. బాధితురాలు భయంతో పోలీసులను ఆశ్రయించగా.. నిర్మాతను అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 26, 2022 10:06 AM