ప్రిన్సిపాల్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్న టీచర్.. ఆ తర్వాత..?

ప్రిన్సిపాల్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్న టీచర్.. ఆ తర్వాత..?

Samatha J

|

Updated on: Jan 31, 2025 | 2:06 PM

ఇంటినుంచి బయలుదేరిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరేవరకూ గ్యారంటీ ఉండదు. ప్రమాదాలు ఏ క్షణం ఏ రూపంలో ఎదురవుతాయో ఎవరికీ తెలీదు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది బీహార్‌లో. ఓ టీచర్‌ , ప్రిన్సిపాల్‌ కలిసి బైక్‌పైన వెళ్తున్నారు. వారికి ఊహించని ప్రమాదం ఎదురవడంతో టీచర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రిన్సిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మీనాపూర్‌లోని తాలింపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫూల్‌బాబు రాయ్ ప్రిన్సిపాల్‌గా, విశాఖ.. టీచర్‌గా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం వారిద్దరూ కలిసి బైక్‌పై స్కూల్‌కు బయలుదేరారు.

రోడ్డుపై వేగంగా వాహన రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వారికి ఎదురుగా ఓ పెద్ద లారీ వీరి బైక్‌ను దాటుకొని వెళ్లింది. మరుక్షణంలొనే ఓ పెద్ద చెట్టుకొమ్మ వీరి బైక్‌పైన పడింది. దాంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి వారు కిందపడిపోయారు. బైక్‌ కూడా ముక్కలైపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో టీచర్‌ స్పాట్‌లోనే మృతి చెందారు. ప్రిన్సిపాల్‌ తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంతకీ చెట్టు కొమ్మ ఎక్కడ్నుంచి వచ్చిందంటే.. వీరి బైకును క్రాస్‌ చేసుకొని వెళ్లిన లారీకి మార్గమధ్యంలో ఎక్కడో చెట్టుకొమ్మ తగిలింది. అది లారీకి ఇరుక్కోవడంతో చెట్టు కొమ్మను లాక్కొచ్చేసింది లారీ. ఈ క్రమంలో ఆ కొమ్మ లారీనుంచి విడిపోయి ప్రిన్సిపల్‌ బైక్‌పైన పడింది. ఆ కొమ్మ రోడ్డుపై పడటంతో వాహనాలు నిలిచిపోయాయి. కొందరు వాహనదారులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ టీచర్‌ మృతి చెందగా.. ప్రిన్సిపల్‌ గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.