Pre-wedding shoot: పెళ్లి కోసం అంత రస్క్‌ అవసరమా..! సినిమా షూటింగ్‌ అనుకునేరు..

|

Mar 20, 2023 | 9:16 AM

వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు బైక్ పై కూర్చున్నారు. బైక్‌ను తాడు సహాయంతో క్రేన్‌కు కట్టారు. ఒక పెద్ద రాయి నేలపై పడి ఉంది. దాని ముందు మహీంద్రా స్కార్పియో వాహనం నిలబడి ఉంది.

ప్రస్తుత కాలంలోప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఓ క్రేజ్‌గా మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కంపల్సరీ అయింది. ఇందుకోసం ఫోటోగ్రాఫర్‌లు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే అక్కడ ఏదైనా సినిమా షూట్‌ జరుగుతుందా.. హీరో హీరోయిన్‌ని ఎత్తుకెళ్తున్నాడా అనిపిస్తుంది. సినిమాను మించిన ఈ సీన్‌ ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు కానీ, ఈ వీడియోను మాత్రం తెగ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు బైక్ పై కూర్చున్నారు. బైక్‌ను తాడు సహాయంతో క్రేన్‌కు కట్టారు. ఒక పెద్ద రాయి నేలపై పడి ఉంది. దాని ముందు మహీంద్రా స్కార్పియో వాహనం నిలబడి ఉంది. క్రేన్ నెమ్మదిగా బైక్‌ను గాలిలోకి లేపింది. వరుడు బైక్ రెండు చక్రాలను తిప్పాలనే ఉద్దేశ్యంతో యాక్సిలరేటర్‌ను తిప్పాడు. హీరో హీరోయిన్‌తో సహా మధ్యలో అడ్డువచ్చిన కారుపైనుంచి జంప్‌ చేసి వెళ్తున్నట్టుగా బైక్‌ను కారు మీదుగా గాల్లో లేపి, మరొక వైపుకు తీసుకువచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే 18 లక్షలమందికి పైగా వీక్షించారు. 20 వేలమంది లైక్‌ చేయగా 5 వేలమందికి పైగా రీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 20, 2023 09:16 AM