సంక్రాంతి స్పెషల్.. దుమ్మురేపిన పొట్టేళ్ల పందాలు!
సంక్రాంతి సంరంభాలు ఘనంగా జరుపుకున్నారు. మూడో రోజు కనుమరోజు పాడి పశువులను పూజించారు. గోశాలలో గోవులను భక్తి ప్రపత్తులతో పూజించి నైవేద్యాలను సమర్పించారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభం అనుగ్రహాన్ని కనుమ వేళ పొందాలని కోరుకుంటారు భక్తులు. దుక్కి దున్నే సమయం నుంచి నూర్పిళ్ల వరకు రైతులకు ఆసరగా నిలిచే వృషభాలను పూజించారు రైతులు.
ఉదయాన్నే వృషభాలను చక్కగా నీళ్లతో కడిగి, పసుపు, కుంకమలతో అలంకరించి, మెడలో గంట కట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి పంట పొలాలకు తీసుకువెళ్తారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభాన్ని పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.కాగా.. ఎన్టీఆర్ జిల్లాలో పొట్టేళ్ల పందాలు దుమ్మురేపాయి. సంక్రాంతి సందర్భంగా చందర్లపాడులో పొట్టేళ్లు పోటీసులు నిర్వహించారు. బరిలో 15 కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు పోటీపడ్డాయి. ఈ పందాలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు గెలిచిన మొదటి మూడు పొట్టేళ్లకు బహుమతులు ఇచ్చారు నిర్వాహకులు.
Published on: Jan 15, 2025 09:52 PM