రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. లొసుగులను బయటపెట్టిన ఐఏఎస్‌ అధికారిణి

Updated on: Mar 15, 2024 | 10:35 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్‌ అధికారిణి నిర్ణయించారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చారు ఫిరోజాబాద్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు ఫిర్యాదులు అందాయి. ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్‌ అధికారిణి నిర్ణయించారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చారు ఫిరోజాబాద్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు ఫిర్యాదులు అందాయి. ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. కాగా, ఆ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ కృతి రాజ్ నిర్ణయించారు. దీంతో తనను గుర్తించకుండా ముఖానికి ముసుగు వేసుకున్నారు. రోగి మాదిరిగా నటించి డాక్టర్‌ చెకప్‌కు వెళ్లారు. అయితే డాక్టర్‌ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని కృతి గ్రహించారు. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేయగా కొందరు గైర్హాజరైనట్లుగా తెలిసింది. రిజిస్టర్‌లో కొందరి సంతకాలు ఉన్నా ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం, సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నన్న ప్రశాంతంగా బతకనివ్వగా.. ఏడ్చేసిన సురేఖా వాణీ…

Natural Star Nani: ‘చిరంజీవి.. వాళ్లకు పెద్ద బరువు’ నాని షాకింగ్ కామెంట్స్

Yatra 2: ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..

5ఏళ్ల సీక్రెట్‌ లవ్‌కు.. పబ్లిక్‌గా పులిస్టాప్‌ !!

8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో…

 

Loading...
Unable to load recommendations.
Follow Us