ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా అంటే ఒక రకమైన అభిప్రాయం ఉంది. పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువ వైరల్ అవుతోందనే బలమైన వాదనలు ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అస్తికరమైన ఘటన వెలుగు చూసింది.

Anil kumar poka

|

Aug 26, 2021 | 11:37 AM

ఇటీవల కాలంలో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతోంది. అయితే, నాణెనికి రెండు ముఖాలు ఉన్నట్లుగానే.. సోషల్ మీడియాలోనూ మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అస్తికరమైన ఘటన వెలుగు చూసింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం స్నేహితులు.. ఓ పేదింటి అమ్మాయికి చేయూతను అందించారు. ఆగిపోయే పెళ్లిని.. ముందుండి జరిపించారు. ఇప్పుడు.. ఈ వివాహమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మణ్ – లక్ష్మీ అనే నిరుపేద దంపతులకు రజిత అనే కూతురు ఉంది. ఇటీవలే రజితకు వివాహం నిశ్చయం అయింది. కానీ ఆర్థిక స్థోమత లేక కూతురు వివాహం ఎలా జరిపించాలో తెలియక ఆ దంపతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక వార్డు సభ్యుడు చెప్యాల గణేష్ అనే వ్యక్తిని కలిసి రజిత వివాహం, ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. ఈ విషయం తెలుసుకున్న గణేష్ సామాజిక సేవలు చేస్తున్న ‘నా కలం అక్షర సత్యం’ ఫేస్ బుక్ పేజీ అడ్మిన్ కు తెలియజేగా.. అడ్మిన్ వెంటనే స్పందించారు. అమ్మాయి దీనగాధ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి, అలాగే తన టీమ్ సభ్యులు అమ్మాయి వివాహ ఖర్చులకు కోసం సోషల్ మీడియా వేదికగా కాంపెనింగ్ మొదలు పెట్టారు. దీంతో.. దాతలు ముందుకు వచ్చి రజిత వివాహానికి అండగా నిలిచారు. తోచిన వారికి తోచిన విధంగా సహాయం అందించారు. పుస్తే, మట్టెతో పాటు ఇతర పెళ్లి సామాగ్రి అందించారు. కొత్త సంసారానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేసి ఇచ్చారు. తోడబుట్టిన అన్నల మాదిరిగా అన్ని వస్తువులు ఇచ్చి రజిత వివాహం ఘనంగా జరిపించారు. అనంతరం వధువు ఇంటిలో విందు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.

5 అడుగులు ఉన్న భారీ నాగుపాముని చాకచక్యంగా పట్టి డబ్బాలో బంధించాడు..:Cobra Video Viral.

ఇదే గోల్డెన్ ఛాన్స్..87 రూపాయలకే ఇళ్లు..!ఎలా అనుకుంటున్నారా..?: House 87 Rupees Video.

చింపాంజీతో మహిళ ఎఫైర్..! చేష్టలు హద్దు మీరడంతో ఎం చేసారంటే..?: Woman affair with chimpanzee Viral Video.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu