Car Stolen Viral Video: ఎన్నికల ప్రచారంలో నాయకురాలు బిజీ.. ఆమె కారు చోరీ .. వీడియో వైరల్..
ఒక నాయకురాలు ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. అయితే జైలు సమీపంలో పార్క్ చేసిన ఆమె కారు చోరీ అయ్యింది. ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు.
ఒక నాయకురాలు ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. అయితే జైలు సమీపంలో పార్క్ చేసిన ఆమె కారు చోరీ అయ్యింది. ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన లగ్జరీ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్‌ను తీహార్ జైలు సమీపంలోని జనక్‌పురి మెయిన్‌రోడ్డులో పలు బ్యాంకు శాఖలు ఉన్న చోట పార్క్ చేశారు. అయితే ప్రచారం ముగించుకుని వచ్చి చూడగా ఆమె కారు మాయమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఒక కారు నుంచి దిగిన వ్యక్తి 15 నిమిషాలు శ్రమించి ఎస్‌యూవీ వెనుక డోర్ అద్దాలు బద్ధలుకొట్టాడు. అనంతరం ముందు డోర్ తెరిచి కారును నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్‌కు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘తీహార్ జైలు ఎదురుగా ఈ సంఘటన జరుగడంతో ఢిల్లీ ఎంత సురక్షితంగా ఉందో మీరే ఊహించవచ్చు. అవమానకర సంఘటన’ అని విమర్శించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

