ఎయిర్‌షోలో షాక్‌..అగ్నిగోళంగా యుద్ధ విమానం.. ఫైలెట్ మృతి!

Updated on: Aug 31, 2025 | 8:19 PM

పోలాండ్ లో ఎయిర్ షో సంధర్భంగా ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ పోలాండ్ లోని రాడోమ్ నగరంలో ఎయిర్ షో కోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్ లో భాగంగా ఎఫ్ 16 యుద్ధ విమానం తాజాగా కూప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని దేశ ఉప ప్రధాని లాడీస్ లావ్ అధికారికంగా ధ్రువీకరించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గాల్లో బారెల్ రోల్ విన్యాసం చేసేందుకు ప్రయత్నించిన ఫైటర్ జెట్ అదుపు తప్పి వేగంగా నేల వైపు దూసుకొచ్చింది. రన్ వే పై కుప్పకూలిన వెంటనే భారీ అగ్నిగోళంగా మారి మంటల్లో చిక్కుకుంది. మంటలతోనే విమానం కొన్ని మీటర్ల దూరం దూసుకొని వెళ్ళిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. విమాన ప్రమాదాలలో సాధారణంగా పైలట్ పారాషూట్ సాయంతో సురక్షితంగా బయటపడటం చూస్తాం. కానీ ఇక్కడ విషాదం ఏంటంటే పైలట్ పారాషూట్ ఉపయోగించలేదు. మృతి చెందిన పైలట్ తన టీమ్ కి న్యాయకత్వం వహించినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఆగస్టు 30న జరగాల్సిన ఎయిర్ షో క్యాన్సిల్ అయింది. 2006లో కొనుగోలు చేసిన దాదాపు 48 యుద్ధ విమానాలలో ఇది ఒకటే. 20 ఏళ్ళ పైబడిన విమానాల స్థానంలో కొత్త వాటి కోసం ఇటీవలే పోలాండ్ దేశం ఆర్డర్ పెట్టింది. ఇందుకు 30 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది. ఎక్స్ వేదికగా స్పందించిన ఉప ప్రధాని లాడీస్ లావ్ పైలట్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ధైర్య సాహసాలు అంకితభావంతో మాతృభూమికి సేవ చేశారని పైలెట్ ను కొనియాడారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో