Viral Video: ఐదేళ్లకే కీబోర్డుపై స్వరాలు.. చిన్నారి ప్రతిభకు ప్రధాని మోదీ అభినందనలు..

|

May 01, 2023 | 9:27 AM

పూవ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఓ చిన్నారి కీ బోర్డుతో అద్భుత స్వరాలు పలికిస్తూ అందర్నీ హృదయాలను గెలుచుకుంటోంది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మనసు దోచేసింది. ఈ చిన్నారి ప్రతిభకు ప్రధాని మోదీ ముగ్ధులయ్యారు.

పూవ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఓ చిన్నారి కీ బోర్డుతో అద్భుత స్వరాలు పలికిస్తూ అందర్నీ హృదయాలను గెలుచుకుంటోంది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మనసు దోచేసింది. ఈ చిన్నారి ప్రతిభకు ప్రధాని మోదీ ముగ్ధులయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. గట్టిగా ఐదేళ్లు కూడా నిండని షలమలీ అనే ఈ చిన్నారి.. తన తల్లి పాడుతున్న పాటకు స్వరాలు పలికించింది. పల్లవాగల పల్లవియాలి అంటూ ఆమె తల్లి పాట పాడడాన్ని, చిన్నారి స్వరాలు అందించింది. అంత చిన్న వయసుకే సంగీత స్వరాలు నేర్చుకుని, పియానోపై వాటిని కచ్చితంగా పలికించడం చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటని కన్నడ రచయిత కేఎస్ నరసింహ స్వామి రచించారు. ఈ వీడియోని మొదట అనంత కుమార్ షేర్ చేశారు. దీన్ని ప్రధాని చూసి రీట్వీట్ చేశారు. ‘‘ఈ వీడియో ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వును తెప్పిస్తుంది. అసాధారణ ప్రతిభ, సృజనాత్మకత కలిగిన షలమలీకి శుభాకాంక్షలు’’అంటూ ప్రధాని మోదీ అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 01, 2023 09:27 AM