153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో

Updated on: Sep 13, 2025 | 10:00 PM

వందల్లో ఎత్తయిన కొండలు, ఆ వెంటనే అగాధాల్లో జారిపోయే లోయలు..ఈ ప్రాంతాల్లో రోడ్డు వేయడమే కష్టం. అలాంటిది ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్‌ నిర్మితమైంది. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్‌లో భారీ భవనాలు కూడా చాలీ చాలనంత స్థలం లేక కొండ అంచుల్లో వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా ఇక్కడ కనాకష్టం.

బైరాబీ సైరంగ్‌ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం నవంబర్‌ 13న ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్‌ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ 8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు ఖర్చయ్యాయి అన్నమాట. ఏడు ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్‌ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్‌కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో

ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్‌ ఐడియా వీడియో

ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో

హైదరాబాద్‌ నుంచి 3 హై స్పీడ్ రైలు మార్గాలు వీడియో