Elephant Balarama: మైసూరు దసరా ఉత్సవాల్లో కనిపించే ఏనుగు బలరామ మృతి.. వీడియో.
గజరాజు బలరామ మృతితో ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ఎన్నో ఏళ్లుగా గజరాజు బలరామ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మోసే ఏనుగుగా బలరామకు ప్రజల్లో గుర్తింపు ఉందని వెల్లడించారు.
కర్ణాటకలో చారిత్రక నగరం మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో తెలిసిందే. ఈ దసరా ఉత్సవాల్లో జంబూసవారి సమయంలో ముందుండి ఏనుగుల బృందానికి సారధ్యం వహించిన బలరాముడు అనే ఏనుగు అనారోగ్యంతో కన్నుమూసింది. ఇప్పటి వరకు 14సార్లు బంగారు అంబరాన్ని మోసింది ఈ ఏనుగు. బలరామ ఏనుగు మృతితో ఆలయ సిబ్బంది, భక్తులు విచారంలో మునిగిపోయారు. గజరాజు బలరామ మృతితో ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ఎన్నో ఏళ్లుగా గజరాజు బలరామ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని కొనియాడారు. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మోసే ఏనుగుగా బలరామకు ప్రజల్లో గుర్తింపు ఉందని వెల్లడించారు. ఎంతోమంది ఈ ఏనుగును అభిమానించేవారని తెలిపారు. ఇప్పుడా ఏనుగు కన్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. కాగా గజరాజు బలరామ వయసు 65 ఏళ్లు. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆదివారం నాడు నాగరహోళె పులుల అభయారణ్యం వద్ద భీమనకట్టె క్యాంపులో తుదిశ్వాస విడిచింది. ఇవాళ సకల లాంచనాలతో ఆ వృద్ధ ఏనుగు అంత్యక్రియలు నిర్వహించారు. బలరామ కొన్నిరోజులుగా గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని, దాంతో ఆహారం, నీరు సరిగా తీసుకోలేకపోయిందని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!