Pigion Backflips: బ్యాక్‌ ఫ్లిప్స్‌ చేస్తూ ఛాలెంజ్‌ విసురుతున్న పావురం.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

Updated on: Aug 10, 2022 | 9:14 PM

సోషల్ మీడియాలో ఇటీవల జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని నిజంగానే ఆశ్చర్యపరుస్తున్నాయి. దాంతో నెటిజన్లు వాటిని బాగా ఇష్టపడుతున్నారు.


సోషల్ మీడియాలో ఇటీవల జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని నిజంగానే ఆశ్చర్యపరుస్తున్నాయి. దాంతో నెటిజన్లు వాటిని బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు మనం మనుషులు రకరకాల స్టంట్స్‌ చేయడం చూసాం.. కానీ తాజాగా ఓ పావురం బ్యాక్‌ఫ్లిప్స్‌ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పావురం చేసే చర్యలకు ఫిదా అయిపోతున్నారు. సో క్యూట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అందమైన ఓ తెల్లని పావురం బ్యాక్‌ఫ్లిప్‌ చేస్తుంది. ఆ పావురం రెక్కలు విప్పుతూ ఎంతో చక్కగా వెనక్కి పల్టీలు కొట్టడం చూస్తుంటే… పర్‌ఫెక్ట్‌ అనకమానరు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 11 సెకన్ల వీడియోను మిలియన్ల మంది వీక్షించగా… లక్షలమంది లైక్ చేసారు. వేలమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పల్టీలు కొట్టడం అంత వీజీకాదని, చాలా కష్టపడాలని, కానీ ఈ పావురం మాత్రం ఇంత సులభంగా చేసేస్తోందని.. మనుషులకే ఛాలెంజ్‌ విసురుతుందని తమ అభిప్రాయాలను పంచుకుంటూ షేర్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 10, 2022 09:14 PM