Squirrel Viral Video: తప్పతాగి తూలుతూ, రచ్చ రచ్చ చేసిన ఉడుత మామ.. ఇంత ఎక్కేసిందా..
సాధారణంగా మనుషులు అధికంగా మద్యం సేవించినపుడు తూలిపోతుంటారు. ఇది సహజం.. మరి పొరపాటున జంతువులో పక్షులో మద్యం సేవించాయనుకోండి..
సాధారణంగా మనుషులు అధికంగా మద్యం సేవించినపుడు తూలిపోతుంటారు. ఇది సహజం.. మరి పొరపాటున జంతువులో పక్షులో మద్యం సేవించాయనుకోండి.. వాటి రియాక్షన్ ఎలాఉంటుందో ఓ సారి ఊహించుకోండి.. ఊహించుకోడమెందుకు.. చూసేస్తే పోలా.. ఇక్కడ ఓ ఉడుత మద్యం మత్తులో ఊగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.వాస్తవానికి ఈ వీడియోలో ఉడుత నేరుగా మందు తాగలేదు. పులియబెట్టిన పియర్స్ ఫుల్లుగా తినేసింది. ఇవి తినడం వల్ల మత్తు ఎక్కుతుంది. ఉడుత కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. చెక్కపై పెట్టిన పీయర్స్‌ను దొరికిందే ఛాన్స్‌గా గబగబా తినేసింది. ఆ తరువాత సినిమా నెక్ట్స్ లెవల్‌లో చూపించింది. పాపం, దానికి వెంటనే మత్తెక్కింది. అటూ ఇటూ తులుతూ.. ఓసారి పడుతూ.. మరోసారి లేస్తూ నానా తిప్పలు పడింది. కాగా ఈ ఉడుత ప్రవర్తనను వీడియో తీసిన వారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఉడుత తీరును చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమదైనశైలిలో కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

