తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..

శిథిలాలుగా మారిన ఓ ఇంటి వద్ద తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం కోసం వెతుకుతోంది ఓ శునకం. ఇన్నాళ్లు తన బాగోగులు పట్టించుకున్నవారు ఇప్పుడు కనిపించడం లేదని మూగగా రోదిస్తోంది.

Phani CH

|

Jul 04, 2022 | 9:04 PM

శిథిలాలుగా మారిన ఓ ఇంటి వద్ద తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం కోసం వెతుకుతోంది ఓ శునకం. ఇన్నాళ్లు తన బాగోగులు పట్టించుకున్నవారు ఇప్పుడు కనిపించడం లేదని మూగగా రోదిస్తోంది. పదే పదే ఆ ఇంటివద్దకు వస్తూ.. అక్కడే తిరుగుతోంది. నెట్టింట్లో వైరల్‌గా మారిన చిత్రాన్ని చూస్తుంటే ఇదే భావన కలుగుతోంది. గతవారం అఫ్గానిస్థాన్‌లో భూకంపం భారీ నష్టం మిగిల్చింది. దాదాపు వెయ్యిమంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వేలల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ కుక్కను పెంచుకుంటున్న ఓచ్కి గ్రామానికి చెందిన కుటుంబం మొత్తం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఇది మాత్రం ప్రాణాలతో బయటపడింది. దాంతో తనతో ఉండే కుటుంబం ఎక్కడికెళ్లిపోయిందో తెలియక వారి కోసం వెతుకుతున్నట్లున్న ఈ చిత్రాన్ని నెటిజన్ ఒకరు షేర్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలేమాత్రం తగ్గని పుష్ఫ ఫీవర్.. WWE రింగులోనూ అదే సీన్

51 ఏళ్ళ వ‌య‌సులో తన కొడుకు మాజీ ల‌వ‌ర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే

వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu