Petrol Theft: పెట్రోలు బంకులో యువకుడు చోరీ.. అందరూ చూస్తుండగానే బైక్‌లో పెట్రోలు నింపుకుని పరార్..
రోజు రోజుకూ పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ దొంగతనాలు ఘటనలు కూడా చూస్తున్నాం..
రోజు రోజుకూ పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ దొంగతనాలు ఘటనలు కూడా చూస్తున్నాం. ఈ తరహా చోరీలు ఎవరూ లేనప్పుడు, నైట్ టైమ్స్‌లో జరుగుతుంటాయి. కానీ డే టైమ్‌లో బంక్ సిబ్బంది, కస్టమర్స్ అంతా ఉండగానే ఓ యువకుడు పెట్రోల్ చోరీకి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు పెట్రోల్ ఫిల్ చేయించుకునేందుకు బంక్‌కు వచ్చాడు. ఆపై కొద్దిసేపు అక్కడి సిబ్బంది వస్తారేమో అని అక్కడ వెయిట్ చేశాడు. కానీ ఎవరూ అతని వద్దకు రాలేదు. దీంతో తన బైక్‌లో తానే స్వయంగా పెట్రోల్ ఫిల్ చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే.. అక్కడి నుంచి బైక్‌పై ఎస్కేప్ అయ్యాడు. సీసీ కెమెరా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. తన వద్దకు ఎవరూ రాకపోవడంతోనే ఇరిటేట్ అయ్యి.. అతను అలా చేసి ఉండొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..