కృష్ణాజిల్లా కలెక్టర్ ఎదుట వ్యక్తి హల్‌చల్.. పిస్టల్‌, కత్తి, కారంపొడితో ఆర్జీదారు హంగామా.. వీడియో

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌తో వెళ్లాడో వ్యక్తి. పిస్టల్ మాత్రమే కాదు.. కత్తి, కారంపొడి కూడా వెంటబెట్టుకెళ్లాడు. సకాలంలో చూసిన పోలీసులు వాటన్నింటినీ లాక్కుని.. అతన్ని స్టేషన్‌కు తరలించారు..

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌తో వెళ్లాడో వ్యక్తి. పిస్టల్ మాత్రమే కాదు.. కత్తి, కారంపొడి కూడా వెంటబెట్టుకెళ్లాడు. సకాలంలో చూసిన పోలీసులు వాటన్నింటినీ లాక్కుని.. అతన్ని స్టేషన్‌కు తరలించారు..ఈ సంఘటన కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేపింది… మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కి అర్జీ ఇవ్వడానికి జెంటిల్‌ మేన్ లా వచ్చాడు కొల్లు అశోక్‌ అనే వ్యక్తి. తనకున్న స్థల వివాదం పరిష్కరించాలని కోరాడు. ప్రాణరక్షణ కూడా కావాలని వేడుకున్నాడు. అంటూ అంటూనే.. తుపాకీ, కత్తి, కారప్పొడి బయటకు తీశాడు. వెంటనే రెస్పాండ్ అయిన పోలీసులు ఉన్న పళంగా వాటిని లాక్కుని.. అతన్ని చిలకలపూడి స్టేషన్‌కు తరలించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కర్నూలు జిల్లాలోని ఓ కుగ్రామంలో వింత ఆచారం.. ఊరి నిండా సమాధులే.. వీడియో

Ray Ban Stories: ఫేస్‌బుక్ నుంచి ఫస్ట్ స్మార్ట్ కళ్లజోళ్లు.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu