Period for men: మగాళ్లకి పీరియడ్ నొప్పి వస్తే ఇదిగో ఇలా ఉంటది..! పరిచయం చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్..
కొచ్చిలో సుప్రసిద్ధ లులూ మాల్‌కు ఎంతోమంది వస్తుంటారు. ఓ యువతి హెడ్‌సెట్ లాంటి ఓ పరికరాన్ని అక్కడికి తీసుకొచ్చింది. ఓ యువకుడికి ఏం చెప్పిందో ఏమో.. అతను ఆ డివైజ్ వైర్లను
కొచ్చిలో సుప్రసిద్ధ లులూ మాల్‌కు ఎంతోమంది వస్తుంటారు. ఓ యువతి హెడ్‌సెట్ లాంటి ఓ పరికరాన్ని అక్కడికి తీసుకొచ్చింది. ఓ యువకుడికి ఏం చెప్పిందో ఏమో.. అతను ఆ డివైజ్ వైర్లను పొత్తికడుపునకు అతికించుకున్నాడు. ఆమె ఫస్ట్ బటన్ నొక్కగానే.. గిలిగింతలు పెట్టినట్లు నవ్వాడు. రెండో బటన్ నొక్కగానే ఏదో తెలియని నొప్పి మొదలైంది. మూడో బటన్‌తో ముఖ కవళికలు మారిపోయాయి. నాలుగో బటన్ దెబ్బకు నొప్పితో గింజుకున్నాడు. ఐదో బటన్ నొక్కగానే.. ‘ప్లీజ్ ఆపెయ్’ అంటూ గిలగిలా కొట్టుకున్నాడు. ఆ బాధ చూడలేక ఆ యువతి స్విచ్ ఆఫ్ చేసింది. ఆ పరికరం పేరు ‘పీరియడ్ పెయిన్ సిమ్యులేటర్ . రుతుస్రావ సమయంలో మహిళలు భరించే నొప్పిని పురుషుడికి పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA, #Feelthepain పేరుతో దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో మహిళలు పీరియడ్స్ సమయంలో అనుభవించే నొప్పిని 4 నుంచి 10 దశల్లో చూపిస్తారు. మహిళలు 8 నుంచి 9 దశల వరకు ఆ నొప్పిని సునాయాసంగా భరించగలరు. పురుషులు మాత్రం ఆరో దశకే కుప్పకూలిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

