సాధారణంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, అధికారులు సరిగా పనిచేయకపోయినా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసనలు తెలుపుతుంటారు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువులు కూడా నిరసన తెలిపేందుకు తమదైనశైలిలో ధర్నాలు చేస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. అవును అటవీ ప్రాంతంలో ఉండే రెండు ఏనుగులు రోడ్డుకు అడ్డంగా చెట్లు పడగొట్టి నిరసనకు దిగాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం ఆ ఏనుగులకు ఏం అవసరమొచ్చిందో ఏమో… లేకపోతే ఆ రోడ్డున వెళ్తున్న చెరకు లారీలు ఆపకుండా వెళ్లిపోయాయో.. మా దారిలో వెళ్తూ మాకే టోల్ ఫీ కట్టకుండా వెళ్తారా అనుకున్నాయో ఏమో.. వెంటనే ఆ రోడ్డుకు పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేలా తన బలమైన దంతాలతో కూల్చేసింది ఓ ఏనుగు. ఆరోడ్డుకు మరో వైపునుంచి మరో పెద్ద ఏనుగు ఈ ఏనుగు నిరసనకు మద్దతుగా వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడింది. ఇంకేముంది. అటూ ఇటూ వచ్చే వాహనదారులు ఎక్కడివారక్కడే ఆగిపోయారు. ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విట్టర్ పేజీ పోస్ట్ చేసింది.ఈ అరుదైన దృశ్యం వీక్షకులను షాక్ అయ్యేలా చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోడ దూకి ఇంటి ఆవరణలోకి చిరుత.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యం చూసి అంతా షాక్