Marriages Tradition: ఆ గ్రామంలో ఇప్పటికి మేనరికపు పెళ్లిళ్లు.. తగ్గని కన్నీటి వ్యధలు. వీడియో

|

Oct 30, 2023 | 9:59 AM

పార్వతీపురం మన్యం జిల్లా పాంచాలి అనే గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంట్లో మేనరికం పెళ్లిళ్లు జరగడం సంప్రదాయం. అక్కడ వివాహాలు బయట గ్రామాల వారితో కాకుండా అదే గ్రామంలోని వారితో జరుగుతాయి. ఈ గ్రామంలో ఎవరైనా సరే తమ ఆడపిల్లను మేనమామ లేదా మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం చేస్తారు. అలా స్వయాన బావ, మరదలు లేని పక్షంలో మరొక సమీప బంధువుతో మేనరిక వివాహాలు జరిపిస్తారు.

పార్వతీపురం మన్యం జిల్లా పాంచాలి అనే గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంట్లో మేనరికం పెళ్లిళ్లు జరగడం సంప్రదాయం. అక్కడ వివాహాలు బయట గ్రామాల వారితో కాకుండా అదే గ్రామంలోని వారితో జరుగుతాయి. ఈ గ్రామంలో ఎవరైనా సరే తమ ఆడపిల్లను మేనమామ లేదా మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం చేస్తారు. అలా స్వయాన బావ, మరదలు లేని పక్షంలో మరొక సమీప బంధువుతో మేనరిక వివాహాలు జరిపిస్తారు. ఇది తరతరాలుగా ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు ఆ గ్రామస్తులు. బంధువుల ఇంటి ఆడపిల్లను తెచ్చుకుంటే ఇంట్లోని పెద్దవారిని జాగ్రత్తగా చూసుకుంటారని ఇరు కుటుంబాలవారు విశ్వసిస్తారు. ఈ పెళ్లిళ్ల వల్ల కుటుంబాలు అన్నీ కలిసే ఉంటాయి, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా ఉంటారని భావిస్తారు. అందుకోసం మేనరికపు పెళ్లిళ్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ మేనరికం వివాహాల వల్ల ఎన్నో బాధలు పడతున్నారు. మేరికం వివాహం చేసుకున్న దంపతులకు పుట్టే పిల్లలు ఏదో ఒక రుగ్మతతో పుట్టడం..వారికి నరకప్రాయంగా మారుతోంది. కొందరి బుద్ధి మాంద్యం, పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, గుండెజబ్బులు, కంటిచూపులేకపోవడం, వినికిడి లోపం ఇలా ఏదొక సమస్యతో పుడుతున్నారు. ఇది ఆ దంపతులకు జీవితకాలం భారంగా పరిణమిస్తుంది. కొందరికి గర్భస్రావాలు, మరికొందరికి మరణించిన శిశువులు పుట్టడం, ఇంకొందరికి పుట్టిన వెంటనే మరణించడం ఇలా వారి జీవితాలను విషాదంలోకి నెట్టేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మేనరికపు వివాహాలు. అందుకే వైద్యులు సైతం మేనరికపు వివాహాలు చేసుకోవడం మంచిదికాదని సూచిస్తారు. ఎంతగా అవగాహన కల్పించినా వీరు మేనరికపు వివాహాలకే మొగ్గు చూపుతూ, అంగవైకల్యంతో పుట్టిన బిడ్డలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మేనరికపు వివాహాల వల్ల జనెటిక్‌ సమస్యలు తలెత్తి పుట్టే బిడ్డల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని అంటున్నారు వైద్యులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..