రోడ్డు మధ్యలో క్షుద్రపూజలు.. భయాందోళనలో స్థానికులు
టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడడం లేదు. క్షుద్రపూజలు, నరబలులతో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు కొందరు. అర్ధరాత్రివేళ నడిరోడ్డులో క్షుద్రపూజలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియక గ్రామస్తులు భయంతో రాత్రయితే రోడ్డుమీదకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక మండల పరిషత్ ఆఫీసు మూలమలుపు చౌరస్తాలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి నిమ్మకాయలు, కొబ్బరికాయలతో క్షుద్రపూజలు చేశారు. అంతేకాదు కోడిని బలిచ్చారు. నడిరోడ్డుపై దర్శనమిచ్చిన ఈ క్షుద్రపూజల ఆనవాళ్లు ప్రజలను తీవ్రభయాందోళనకు గురిచేశాయి. ప్రతి ఆది, గురువారాల్లో ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిత్యకృత్యంగా మారాయి. నివాస ప్రాంతాల్లో ఇలా క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు భయాందోళన గురవుతున్నారు. ఆది, గురువారాల్లో రాత్రయితే ఇంటినుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నవారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని, ఈ క్షుద్రపూజల బాధనుంచి తమకు విముక్తి కలిగించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఆధునిక యుగంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలకు భయపడవద్దని, వాటిని నమ్మవద్దని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛీ !! విజయ్ తీరుపై కట్టప్ప షాకింగ్ రియాక్షన్
‘ చెప్పాల్సింది చెప్పేశా. ఇంకేమీ లేదు’
నిద్రిస్తుండగా ఘోర ప్రమాదం !! వీర హనుమాన్ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
Shanmukh Jaswanth: బిగ్ బాస్‌కి అనవసరంగా వెళ్లా.. నా జీవితం ఫినిష్ అనుకున్నా
