ఐదుగురికి పునర్జన్మనిచ్చిన జనసేన కార్యకర్త

Updated on: Oct 14, 2025 | 9:01 PM

తాను మరణించి ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు ఓ జనసేన కార్యకర్త. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనతో అతని తల్లిదండ్రులు ఓ బాలుడికి గుండె ఇచ్చి ప్రాణం పోయడంతో పాటు, ఇతర అవయవాలు దానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాంబే గృహాల్లో నివసించే పీతా విజయకృష్ణ జనసేన కార్యకర్త పవన్ కల్యాణ్ అభిమాని.

స్థానిక వాటర్ సర్వీసు సెంటర్లో పనిచేస్తుంటాడు. అతని తండ్రి శ్రీనివాస్ లారీ డ్రైవర్, తల్లి సుబ్బలక్ష్మి పక్షవాతంతో బాధపడుతోంది. ఈ నెల 6న రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన విజయ కృష్ణను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు కిమ్స్ కు తరలించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ధ్రువీకరించడంతో యువకుడి తల్లిదండ్రులు తన కుమారుడి అవయవాలు మరొకరికి అమరిస్తే వాళ్లలోనైనా మా కొడుకు బతికి ఉంటాడని చెప్పారు. దీంతో జీవన్ దాన్ సభ్యులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన 14 ఏళ్ల బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రి వైద్యులు హుటాహుటిన అవయవాలు తరలించి తిరుపతిలో బాలుడికి గుండె దానం చేశారు. ఇతర అవయవాలు.. కళ్ళు, ఊపిరితిత్తులు ,కాలేయం, కిడ్నీ కూడా ఆరోగ్యంగా ఉండడంతో వాటిని భద్రపరిచారు. అంతేకాకుండా విజయకృష్ణ తల్లికి కిమ్స్ ఉచిత వైద్యం చేయించడానికి అంగీకరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాలర్ల వలలో డూమ్స్‌ చేప.. ప్రకృతి విపత్తు తప్పదా

ఒక్క ఫోన్‌ కాల్‌తో ఆమె కోట్లకు పడగెత్తింది

ప్రపంచంలోనే అతి పెద్ద విమానం శంషాబాద్‌లో ల్యాండింగ్

ఉరివేసుకొని ప్రాణం తీసుకోబోయిన మహిళ.. కట్ చేస్తే..

విద్యార్ధులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌