Money Plant: డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..

|

Dec 11, 2024 | 11:45 AM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. 119 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ద్వారా రైతులు పండించే పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో రైతుల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు.

స్టాల్ లో రైతులకు సులువుగా అర్ధమయ్యేలా పామాయిల్‌ సాగు గురించి అవగాహన కల్పిస్తూ ఆయిల్‌ ఫామ్‌ చెట్టుకు కరెన్సీ నోట్లను అతికించి చెట్టుకి డబ్బులు కాస్తున్నట్టుగా ఏర్పాటు చేశారు ఆయిల్ ఫెడ్ సంస్థ అధికారులు. ఆ చెట్టును విచిత్రంగా చూశారు రైతులు. ఆయిల్‌ ఫామ్‌ సాగుచేస్తే మంచి దిగుబడులు వస్తాయని, రైతులకు మంచి ఆదాయవనరుగా మారుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పై ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగు చేస్తే…మూడు ఏళ్ళు దాటిన తరువాత నుంచి పామ్ ఆయిల్ గెలల దిగుబడితో లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. ఇలా 30 నుంచి 35 ఏళ్ళు ఆయిల్ ఫామ్ మొక్కలతో అధిక లాభాలు వస్తాయని తెలియజేసేసందుకు ఇలా చెట్లకు నోట్లను అతికించినట్టు తెలిపారు. స్టాల్స్ ను పరిశీలించేందుకు వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి డబ్బుల చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి మీ చెట్లకు డబ్బులు కూడా కాస్తయా అని స్టాల్ ఏర్పాటు చేసిన అధికారులను అడిగారు. అందుకు ఆ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోటీశ్వర్లను చేసేందుకు సబ్సిడీ పై ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. అధికారులు చేసిన విన్నూత్న ఆలోచనకు ఎమ్మెల్యే ఫిదా అయ్యారు. పామాయిల్ సాగు.. రైతులకు లాభసాటిగా ఉంటుందని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని రైతులకు వివరిస్తున్నారు. సులభంగా అర్థం కావడానికి అధికారులు ఈ విధంగా ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.