పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

Edited By:

Updated on: Jan 30, 2026 | 5:19 PM

పాలమూరు జిల్లాలో నకిలీ పోలీసుల ముఠా కలకలం రేపుతోంది. అమాయక మహిళలు, వృద్ధులే లక్ష్యంగా బంగారాన్ని దోచుకుంటున్నారు. తాము మఫ్టీ పోలీసులమని నమ్మించి, దొంగల ముప్పు ఉందని చెప్పి, బంగారాన్ని కాగితంలో పెట్టినట్టు నటించి గులకరాళ్లు ఇచ్చి పరారవుతున్నారు. మహబూబ్‌నగర్‌లో వరుస దోపిడీలు జరిగాయి. పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పోలీసులమంటూ అమాయక ప్రజలను మోసం చేసి బంగారం దోచుకుంటున్న నయా ముఠా పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులే లక్ష్యంగా రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని నమ్మించి, దొంగల ముప్పు ఉందంటూ బంగారాన్ని తీయించి కాగితంలో పెట్టినట్టు నటించి గులకరాళ్లు ఇచ్చి పరారవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ ముఠా చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం రద్దీ ప్రాంతాల్లోనే ముగ్గురు వ్యక్తులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల ఓ మహిళను ఆపి, “మేము పోలీసులం, పెద్ద సార్ పిలుస్తున్నారు” అంటూ నమ్మించి మెడలోని నాలుగున్నర తులాల మంగళసూత్రాన్ని తీసుకున్నారు. బంగారాన్ని కవర్‌లో పెట్టినట్టు చూపించి గులకరాళ్లు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఇదే తరహాలో రెండు నెలల క్రితం ఓ వృద్ధ దంపతులను మోసం చేసి సుమారు 8 తులాల బంగారాన్ని దోచుకున్నారు. తాజాగా శ్రీనివాస కాలనీలో సుకన్య అనే మహిళను హాస్పిటల్‌కు వెళ్తుండగా ట్రాప్ చేసి, నకిలీ ఐడీ కార్డు చూపించి రెండున్నర తులాల బంగారాన్ని కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పోలీసుల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పహారా పెంచి ఇటువంటి ఘటనలను అరికట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా

తెలంగాణలో Ed.CET, ICET-2026 షెడ్యూల్స్ విడుదల

రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన.. చూస్తే గుండె తరుక్కుపోతుంది

Srisailam: భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం

ఓర్నీ.. మటన్‌ బొక్క ఎంతపని చేసిందీ