అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు

|

Oct 07, 2024 | 6:58 PM

ఇటలీలో సెకండ్ హ్యాండ్ వస్తువులు సేకరించి విక్రయించే ఓ ‘జంక్ డీలర్’ కుటుంబం పంట పండింది. కాప్రి పట్టణంలో చాలా ఏళ్లక్రితం ఓ సెల్లార్‌లో లభించిన ఓ కళాఖండం ప్రసిద్ధ చిత్రకారుడు పికాసో గీసిన ఒరిజినల్ పెయింటింగ్ అని నిర్ధారణ అయింది. 1962లో దొరికిన ఈ పెయింటింగ్ విలువ ప్రస్తుతం రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇటలీలో సెకండ్ హ్యాండ్ వస్తువులు సేకరించి విక్రయించే ఓ ‘జంక్ డీలర్’ కుటుంబం పంట పండింది. కాప్రి పట్టణంలో చాలా ఏళ్లక్రితం ఓ సెల్లార్‌లో లభించిన ఓ కళాఖండం ప్రసిద్ధ చిత్రకారుడు పికాసో గీసిన ఒరిజినల్ పెయింటింగ్ అని నిర్ధారణ అయింది. 1962లో దొరికిన ఈ పెయింటింగ్ విలువ ప్రస్తుతం రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. లుయిగి లో రోస్సో అనే డీలర్‌కు 1962లో ఈ పెయింటింగ్‌ లభ్యమైందని, కొంతమొత్తం వెచ్చించి దీనిని కొనుగోలు చేశారని ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది. రోస్సో ఈ పెయింటింగ్‌ను పోంపీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. భార్యకు నచ్చకపోయినప్పటికీ దానిని తన గదిలో గోడకు వేలాడదీశాడు. కొన్ని దశాబ్దాలపాటు అది అలాగే ఉంది. రోస్సో కొడుకు ఆండ్రియా కళలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడం మొదలుపెట్టడంతో ఈ పెయింటింగ్‌ గుర్తింపులో అది కీలక మలుపు అయింది. పెయింటింగ్ ఎగువ భాగంలో ఎడమ వైపు మూలన ఉన్న ప్రత్యేక సంతకాన్ని అతడు గుర్తించాడు. మిస్టరీగా ఉన్న సంతకం ఎవరిదో తెలుసుకునేందుకు ప్రముఖ ఆర్ట్ డిటెక్టివ్ మౌరిజియో సెరాసినితో పాటు పలువురు నిపుణుల బృందాన్ని సలహా కోరాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ ఓపెన్ చేసి చూడగా..

పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!

రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!

హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. ఎన్నేళ్ల జైలుశిక్షో తెలుసా ??

ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??