zomato: జొమాటో నిర్వాకం.. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ వచ్చింది..!

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. తన స్నేహితుడి కుటుంబం వెజ్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ వచ్చిందంటూ అశ్విని శ్రీవాస్తవ అనే నెటిజన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

zomato: జొమాటో నిర్వాకం.. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ వచ్చింది..!

|

Updated on: Jul 18, 2023 | 8:14 AM

పవిత్రమైన సావన్ మాసంలో ఆదివారం రాత్రి వారణాసిలోని తన స్నేహితుడి కుటుంబం జొమాటో యాప్ ద్వారా స్థానికంగా ఉన్న ప్రముఖ హోటల్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ పన్నీర్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినట్లు చెప్పారు. ఆ ప్యాక్ విలువ రూ.1,228గా తెలిపాడు. అయితే, వాళ్లకు వెజ్ బిర్యానీకి బదులు చికెన్ బిర్యానీ వచ్చిందని చెప్పాడు. అది గమనించని తన స్నేహితుడి కుటుంబం ఆ బిర్యానీని తిన్నట్లు వివరించాడు. అనంతరం అది చికెన్ అని గుర్తించి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా, ఆర్డర్ కు సంబంధించిన వీడియో, ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ ఘటనపై జొమాటో స్పందించింది. జరిగిన ఘటనకు క్షమాపణలు కోరుతున్నామని ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us