గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా జైలుకెళ్లాల్సిందే.!

Ravi Kiran

24 Sep 2024

పోక్సో చట్టంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.  చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ చేసినా, చూసినా పోక్సో చట్టం ప్రకారం నేరమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా

చైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసులో మద్రాస్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే పోక్సో చట్టాన్ని సవరించాలని కేంద్రానికి సుప్రీం సూచించింది.  

గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా

చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదం వాడకుండా పోక్సో చట్ట చేయాలని పార్లమెంటుకు ధర్మాసనం సూచన చేసింది.  చట్టసవరణకు ముందే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఈ సవరణలను అమలు చేయాలని సుప్రీం కోరింది. 

గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా

చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడకూడదంటూ అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది.  చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదానికి బదులు చైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటివ్‌- అబ్యూసివ్‌ మెటీరియల్‌గా మార్చాలని ధర్మాసనం సూచించింది. 

గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా

మద్రాస్‌ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ చేసిన 28 ఏళ్ల ఒక యువకుడిపై కేసు నమోదైంది. 

గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా

అయితే మద్రాస్‌ హైకోర్టు మాత్రం అతడిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను నిలిపేసింది. ఈ మధ్యకాలంలో పిల్లలు పోర్న్‌ వీడియోలు చూస్తున్నారనీ, అయితే సమాజం వారిని శిక్షించకుండా చైతన్యవంతం చేయాలని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. 

గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా

 మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆ వ్యక్తిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను పునరుద్ధరించింది. చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ చేయడం.. చూడడం తప్పకుండా నేరమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

గూగుల్‌లో వీటిని చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా