Government schoo: మిడ్‌డే మీల్‌లో దారుణం.! పిల్లలకు కేవలం ‘సాల్ట్‌ రైస్‌’ మాత్రమే.. ప్రభుత్వ స్కూల్‌ తీరు మండిపడుతున్న జనం..

|

Oct 06, 2022 | 6:45 PM

ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో


ఒక ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు మిడ్‌ డే మీల్‌లో సరైన భోజనం అందించకుండా నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడంతో ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.అయితే ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని విద్యార్థుల తల్లిదండ్రుల తీసి యోగి సార్‌ ఇలాంటి పాఠశాలకు ఎవరైనా తమ పిల్లలను పంపించగలరా అని ప్రశ్నించారు.యోగి జీ.. మీరైనా పట్టించుకోండి అని విద్యార్థి తల్లిదండ్రులు అభ్యర్థించారు. వాస్తవానికి ఆ స్కూల్‌ గోడలపై ఉన్న మిడ్‌ డే మెనులో పాలు, రోటీలు, పప్పు, కూరగాయలు, బియ్యం లిస్ట్‌ ఉంది. కానీ ఆ పాఠశాల్లో మాత్రం ఉప్పుతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్‌ నితిష్‌కుమార్‌ స్పందించి…మెనులో ఉన్న ప్రకారమే భోజనం అందించమనే ఆదేశించాం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్య వైఖరిని సహించేదే లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us on